Last Updated:

Hanu Man Movie: ’హనుమాన్‘ ధియేటర్లకు కొంతమంది పెద్దలు అడ్డుపడ్డారు.. నిర్మాత నిరంజన్ రెడ్డి

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం హనుమాన్.ఈ చిత్రం జనవరి 12న విడుదలవుతోంది. అదే రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం గుంటూరు కారం కూడా రిలీజ్ అవుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నైజాం ప్రాంతంలో పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్ ప్రాంతంలోని 76 సింగిల్ స్క్రీన్లలో 70 గుంటూరు కారం కోసం కేటాయించారు.

Hanu Man Movie: ’హనుమాన్‘ ధియేటర్లకు కొంతమంది పెద్దలు అడ్డుపడ్డారు.. నిర్మాత నిరంజన్ రెడ్డి

 Hanu Man Movie: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం హనుమాన్.ఈ చిత్రం జనవరి 12న విడుదలవుతోంది. అదే రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం గుంటూరు కారం కూడా రిలీజ్ అవుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నైజాం ప్రాంతంలో పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్ ప్రాంతంలోని 76 సింగిల్ స్క్రీన్లలో 70 గుంటూరు కారం కోసం కేటాయించారు.

లాంగ్ రన్ ఉంటుంది..( Hanu Man Movie)

ఈ నేపథ్యంలో హనుమాన్ చిత్రం నిర్మాత నిరంజన్ రెడ్డి మీడియాతో సమావేశమయ్యారు. తన చిత్రానికి 10-15 స్క్రీన్లు వస్తాయని అనుకున్నా అవి 10 లోపే ఉన్నాయని అన్నారు. 3-4 రోజుల తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని చెప్పారు. సినిమా కచ్చితంగా 5-6 వారాల పాటు లాంగ్ రన్ ఉంటుందని అన్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడలో విడుదల చేస్తున్నారు. బడ్జెట్ విషయంలో తాము ఎప్పుడూ రాజీపడలేదని, హనుమాన్ విజువల్ ఫీస్ట్ అవుతుందని నిరంజన్ రెడ్డి అన్నారు.కొంతమంది ఎగ్జిబిటర్లు జనవరి 12న హనుమాన్‌ని తెరకెక్కించాలని భావించినప్పటికీ, పెద్దలు అలా చేయడానికి అనుమతించడం లేదని ఆయన అన్నారు. అయితే విడుదల తర్వాత, హనుమాన్  అందరి దృష్టిని ఆకర్షిస్తుందనిఒక వారం రోజుల్లో థియేటర్లను కూడా కైవసం చేసుకుంటుందని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు.

1200 థియేటర్లలో విడుదల..

మకోవైపు దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా హిందీ విడుదల కోసం తాము చేసుకున్న అగ్రిమెంట్ల కారణంగా విడుదల తేదీని మార్చలేమని స్పష్టం చేసారు. హిందీ బయ్యర్లు ఈ సినిమాపై చాలా పెట్టుబడి పెట్టారు . వారు 1200 థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి తెలుగులో కేవలం 50 థియేటర్ల కోసం 1200 థియేటర్లను కోల్పోలేం. మొదటి నుంచి తనకు సోషియో ఫాంటసీ చిత్రాలంటే ఇష్టమని ప్రశాంత్ చెప్పారు. హను-మాన్ ఒక విధంగా సోషియో-ఫాంటసీ చిత్రం. సినిమా చూశాక మీరు తేజ సజ్జను మరెవ్వరినీ ఊహించుకోలేనంత బాగా చేసాడు. అంత నమ్మకంతో ఆ పాత్రను చేశాడని వర్మ అన్నారు.