Sonakshi Sinha: సోనాక్షి సిన్హా పెళ్లి తరువాత ఇస్లాం మతంలోకి మారుతుందా?
ప్రస్తుతం సోనాక్షి.. జహీర్ ఇక్బాల్ వివాహం గురించి బాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వీరిద్దరి వివాహం ఆదివారం అంటే జూన్ 23 సాయంత్రం జరుగనుంది. అయితే పెళ్లి తర్వాత సోనాక్షి ఇస్లాం మతంలోకి మారుతుందా అన్న చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనిపై జహీర్ తండ్రి ఇక్బాల్ రత్నాసి వివరణ ఇచ్చారు.
Sonakshi Sinha: ప్రస్తుతం సోనాక్షి.. జహీర్ ఇక్బాల్ వివాహం గురించి బాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వీరిద్దరి వివాహం ఆదివారం అంటే జూన్ 23 సాయంత్రం జరుగనుంది. అయితే పెళ్లి తర్వాత సోనాక్షి ఇస్లాం మతంలోకి మారుతుందా అన్న చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనిపై జహీర్ తండ్రి ఇక్బాల్ రత్నాసి వివరణ ఇచ్చారు.
అందరం మనుషులమే..(Sonakshi Sinha)
వీరి వివాహం ఇటు హిందూ.. అటు ముస్లిం సంప్రదాయం ప్రకారం జరగదని స్పష్టం చేశారు. పెళ్లి తర్వాత సోనాక్షి ఇస్లాం మతంలోకి మారబోతోందంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఇరువురికి తాము సివిల్ మ్యారేజీ చేస్తున్నట్లు జహీర్ తండ్రి మీడియాతో చెప్పాడు. వారిద్దరి మనసులు కలిశాయి. కాబట్టి మతాలతో సంబంధం లేదని ఆయన అన్నారు. తాము మానవత్వాన్ని నమ్ముతామన్నారు. దేవుడిని హిందువు భగవాన్ అంటారు. అదే ముస్లింలు అయితే అల్లా అని సంబోధిస్తారు. కాబట్టి చివరకు అందరం మానవమాత్రులమే కదా అని ఆయన ఎదరుప్రశ్న వేశారు. జహీర్‌తో పాటు సోనాక్షికి తమ దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు జహీర్‌తండ్రి.
ఇటీవలే సోనాక్షి తండ్రి శత్రుఘ్నసిన్హా సన్నిహిత మిత్రుడు శశిరంజన్ సోనాక్షి పెళ్లికి సంబంధించిన వివరాలు జాతీయ మీడియాతో పంచుకున్నారు. సోనాక్షి తను ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ పెళ్లికి అందరూ హాజరవుతున్నాం.. శత్రుజీ సోదరుడు అమెరికాలో ఉన్నారు ఆయన కూడా వస్తున్నారు. జహీర్ ఇక్బాల్ ఇంట్లో రిజిస్టర్ మ్యారేజి జరగబోతోంది. పెళ్లి పట్ల ఎవరికి అసంతృప్తి లేదు. అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఇదిలా ఉంటే ఇటీవలే శత్రు కూడా తాను పెళ్లికి వెళ్తున్నట్లు చెప్పారు. మీడియాలో వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. సోనాక్షి ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంటున్నందు వల్ల సోనాక్షి తండ్రి, తల్లి రావడం లేదని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీన్ని శత్రు ఖండించారు. ఖచ్చితంగా తాను పెళ్లికి వెళ్తాను తమ కూతురి సంతోషమే తమ సంతోషమని సోనాక్షి తండ్రి బాలీవుడ్ నటుడు శత్రు మీడియాతో మాట్లాడుతూ అన్నారు.