Last Updated:

Top Ten Heroines: టాప్ టెన్‌ హీరోయిన్స్‌లో మొదటి స్థానంలో నిలిచిన అలియాభట్

హీరోహీరోయిన్ల క్రేజ్‌ను బట్టి వాళ్లవాళ్ల ప్లేస్‌లు డిసైడ్‌ అవుతుంటాయి. ఐతే.. ఇవి సినిమా సినిమాకి.. మారిపోతుంటాయి. ఒక్కోసారి రోజుల గ్యాప్‌లో కూడా ప్లేస్‌లు ఛేంజ్‌ అవుతుంటాయి. నెలనెలా ఎవరెవరు టాప్‌ ప్లేస్‌లో ఉన్నారో ఆర్మాక్స్‌ మీడియా సంస్థ ఓటింగ్‌ నిర్వహించి లిస్ట్‌ రిలీజ్‌ చేస్తుంది.

Top Ten Heroines: టాప్ టెన్‌ హీరోయిన్స్‌లో మొదటి స్థానంలో నిలిచిన  అలియాభట్

Top Ten Heroines: హీరోహీరోయిన్ల క్రేజ్‌ను బట్టి వాళ్లవాళ్ల ప్లేస్‌లు డిసైడ్‌ అవుతుంటాయి. ఐతే.. ఇవి సినిమా సినిమాకి.. మారిపోతుంటాయి. ఒక్కోసారి రోజుల గ్యాప్‌లో కూడా ప్లేస్‌లు ఛేంజ్‌ అవుతుంటాయి. నెలనెలా ఎవరెవరు టాప్‌ ప్లేస్‌లో ఉన్నారో ఆర్మాక్స్‌ మీడియా సంస్థ ఓటింగ్‌ నిర్వహించి లిస్ట్‌ రిలీజ్‌ చేస్తుంది. ఈ నెల రిలీజ్‌ చేసిన లిస్ట్‌లో టాప్‌ ప్లేస్‌లో ఆలియాభట్‌ నిలిచింది. ఇక సెకండ్‌ ప్లేస్‌ను సమంత దక్కించుకుంది.

సినిమా ప్రపంచంలో ఎప్పుడు ఎవరికి ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంటుందో తెలుసుకోవడం చాలా కష్టం. ఒక్కోసారి ఒక్కొక్క హీరో, హీరోయిన్లను అభిమానించే ప్రేక్షకుల మనసు, ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. సహజంగా సినిమాలలో ఉండే హిట్స్‌, ఫ్లాప్స్‌లను బట్టి, హీరో హీరోయిన్లకు వచ్చే అవకాశాలను బట్టి, సినీ ఇండస్ట్రీలో వారికి ఉన్న క్రేజ్‌ను బట్టి ఎవరు టాప్ వన్‌లో ఉన్నారు.. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది అంచనా వేస్తుంటారు. ప్రతినెల ఆర్మాక్స్ మీడియా సంస్థ అభిమానుల ఓటింగ్‌ను ఆధారం చేసుకుని టాప్ టెన్ హీరోయిన్ల జాబితాలను వెల్లడిస్తుంది. ఈ క్రమంలో మే నెలలో విడుదల చేసిన జాబితాలో టాప్ వన్‌లో ఎవరున్నారు..? ఆ తరువాత స్థానాల్లో ఎవరున్నారు..? అనేది వెల్లడించింది.

సెకండ్ ప్లేసులో సమంత..(Top Ten Heroines)

ఈసారి టాప్ టెన్‌ హీరోయిన్స్‌లో అలియా భట్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. బాలీవుడ్‌లో తనకంటూ ఒక క్రేజ్ ఉన్న అలియా భట్, తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక ఈసారి టాప్ టూగా సమంత నిలిచింది. ఈ ఏడాది పెద్దగా సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని పెంచుకుంది సమంత. అందుకే సెకండ్‌ ప్లేస్‌ను దక్కించుకుంది. ఇక టాప్ త్రీలో జవాన్ సినిమా ద్వారా అందరినీ ఆకట్టుకున్న దీపికా పదుకొనే నిలిచింది. టాప్ ఫోర్ స్థానంలో నిలిచిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు. యానిమల్ సినిమాతో తనకంటూ ఒక ట్రెండ్ సెట్ చేసుకున్న రష్మిక, పుష్ప-2తో అందరిని ఆకట్టుకోబోతోంది.

టెన్త్ ప్లేసులో నయనతార..

ఇక టాప్ ఫైవ్‌లో కాజల్ అగర్వాల్ నిలిచింది. పెళ్లి చేసుకున్న తర్వాత తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో మాత్రం ఆమె ఇంకా టాప్ ఫైవ్‌లోనే ఉంది. ఇక టాప్ సిక్స్‌లో కృతి సనన్ నిలిచింది. గత సంవత్సరం ఆది పురుష్ సినిమాతోపాటు గణ్‌పథ్ సినిమాలో నటించిన కృతి సనన్ భారీగానే ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది. ఇక టాప్ సెవెన్‌లో కత్రినా కైఫ్ నిలిచింది. టాప్-8లో కియారా అద్వానీ, టాప్ 9లో టాలీవుడ్ క్యూట్ బ్యూటీగా, తన డాన్సులతో అదరగొడుతున్న శ్రీ లీల నిలిచారు. ఇక టాప్ టెన్‌లో సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్‌గా పేరుపొందిన నయనతార నిలిచారు. అభిమానులు తమ హీరోయిన్లపై అభిమానంతో చేసిన ఓటింగ్ ఆధారంగా ఆర్మాక్స్ మీడియా సంస్థ మే నెలకు గాను ఈ సర్వే చేసి ఫలితాలను విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి: