Last Updated:

Shatrughan Sinha: సోనాక్షి సిన్హా పెళ్లి వార్తలపై తండ్రి శత్రుఘ్న సిన్హా స్పందన ఏమిటో తెలుసా?

శత్రుఘ్నసిన్హా కూతురు సోనాక్షి సిన్హా తన బాయ్‌ఫ్రెండ్‌ జహీర్‌ ఇక్బాల్‌లో ఈ నెల 23న పెళ్లి చేసుకోబోతున్నట్లు సోమవారం జాతీయ మీడియాతో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం గురించి ఆయన తండ్రి బాలీవుడ్‌ నటుడు శత్రుఘ్నసిన్హా స్పందించారు.

Shatrughan Sinha: సోనాక్షి  సిన్హా పెళ్లి వార్తలపై తండ్రి శత్రుఘ్న సిన్హా స్పందన ఏమిటో తెలుసా?

 Shatrughan Sinha: శత్రుఘ్నసిన్హా కూతురు సోనాక్షి సిన్హా తన బాయ్‌ఫ్రెండ్‌ జహీర్‌ ఇక్బాల్‌లో ఈ నెల 23న పెళ్లి చేసుకోబోతున్నట్లు సోమవారం జాతీయ మీడియాతో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం గురించి ఆయన తండ్రి బాలీవుడ్‌ నటుడు శత్రుఘ్నసిన్హా స్పందించారు.

తన కుమార్తె వివాహం గురించి తనకు ఏ మాత్రం తెలియదు. సోనాక్షి కూడా తనకు ఈ విషయం గురించి చెప్పలేదన్నాడు. ఎన్నికల బిజీలో తాను ఉన్నానని, ఈ రోజే ఢిల్లీ వచ్చానని చెప్పారు. మీడియాలో వచ్చిన వార్తలు తప్పించి తనకు మరే సమాచారం తెలియదన్నాడు షాట్‌ గన్‌. ఒక వేళ తన కుమార్తె తన వద్దకు వచ్చి విషయం చెబితే.. తాను తన భార్య ఇద్దరం కలిసి ఆమెను ఆశీర్వదిస్తామన్నారు.ఇప్పటి వరకు ఎన్నికల్లో బిజీగా ఉన్నాను. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాను. ఇప్పటి వరకు సోనాక్షి పెళ్లి గురించి తాను ఎవరితోనూ మాట్లాడలేదన్నారు. మీరు నా కుమార్తె పెళ్లి గురించి అడిగితే మీడియాతో ఏ వార్తలు వచ్చియో అంతే తనకు తెలుసన్నారు. తనకు తన కుమార్తె పూర్తి సమాచారం ఇస్తే తాను తన భార్య ఇద్దరం కలిసి ఆమెను ఆశీర్వదిస్తామన్నారు. తండ్రిగా తాను ఆమె మేలు కోరుతాను అని సోనాక్షి తండ్రి అన్నారు.

తన నిర్ణయాన్ని సమర్థిస్తాను.. ( Shatrughan Sinha)

సినిమా నటుడి నుంచి రాజకీయ అవతారం ఎత్తిన శత్రుఘ్నసిన్హా సోనాక్షి గురించి మాట్లాడుతూ.. ఆమె మేజర్‌ నిర్ణయాలు తీసుకొనే హక్కు ఆమెకు ఉంది. ఆమె నిర్ణయాన్ని తాము పూర్తిగా సమర్థిస్తామన్నారు. తన అంచనా ప్రకారం ఆమె చట్టవ్యతిరేక నిర్ణయాలు తీసుకోదు. ఆమె చిన్న పిల్ల కాదు. ఆమె మేజర్‌ తన సొంత నిర్ణయాలు తీసుకొనే అధికారం ఆమెకు ఉందని ఆయన వివరించారు. తన కుమార్తె పెళ్లి రోజు బారాత్‌లో తాను కూడా డ్యాన్స్‌ చేస్తానన్నాడు శత్రు. అయితే తన సన్నిహిత మిత్రులు తనను ఎందుకు మీ అమ్మాయి మీడియాకు సమాచారం ఇచ్చి తల్లిదండ్రులకు ఎందుకు ఇవ్వలేదని అడుగుతుంటారు. దీనికి నా సమాధానం.. ఈ తరం పిల్లలు వారి నిర్ణయాలు వారే తీసుకుంటారు. చివరి నిమిషంలో తమకు సమాచారం ఇస్తారని చెప్పానన్నారు.

అయితే మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం వెడ్డింగ్‌ కార్డులు సన్నిహిత మిత్రులకు, కుటుంబసభ్యులకు, హీరామండి సినిమాలో పనిచేసిన వారందరికి పంపారు. అయితే వెడ్డింగ్‌ కార్డు మ్యాగజైన్‌ మాదరిగా ఉంది. కవర్‌పైన ‘రూమర్స్‌ ఆర్‌ ట్రూ” పుకార్లు వాస్తవమే అనే అర్ధం వచ్చేలా టెక్స్ట్‌ ముద్రించారు.కాగా సోనాక్షి, జహీర్‌ల వెడ్డింగ్‌ సెలెబ్రలేషన్స్‌ ముంబైలోని బాస్టియన్‌లో జరుగనున్నాయి. ఇక సోనాక్షి సినిమాల విషయానికి వస్తే సంజయ్‌ లీలా బన్సాలీ చిత్రం హీరామండిలో చివరగా నటించారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ర్టీమింగ్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి: