Last Updated:

Alia Bhatt: దీపికకు మద్దతుగా నిలిచిన ఆలియా భట్‌!

బాలీవుడ్‌ స్టార్‌ దీపికా పదుకొనే ఇటీవల ముంబైలో ఓటు వేయడానికి భర్త రణవీర్‌సింగ్‌తో వెళ్లినప్పటి నుంచి సోషల్‌ మీడియాలో ఆమెపై ట్రోలింగ్‌ విపరీతంగా పెరిగిపోయాయి. సోషల్‌ మీడియా యూజర్లు ఆమెది ఫేక్‌ బేబీ బంప్‌ అంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.

Alia Bhatt: దీపికకు మద్దతుగా  నిలిచిన  ఆలియా భట్‌!

Alia Bhatt: బాలీవుడ్‌ స్టార్‌ దీపికా పదుకొనే ఇటీవల ముంబైలో ఓటు వేయడానికి భర్త రణవీర్‌సింగ్‌తో వెళ్లినప్పటి నుంచి సోషల్‌ మీడియాలో ఆమెపై ట్రోలింగ్‌ విపరీతంగా పెరిగిపోయాయి. సోషల్‌ మీడియా యూజర్లు ఆమెది ఫేక్‌ బేబీ బంప్‌ అంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. మరొకడు ఆమె ప్రెగ్నెంట్‌ కాదు అంటే…. ఇంకొకడు ఆమె ఎందుకు అలా నడుస్తోంది.. ఆమె బంప్‌ అంత పెద్దగా లేదు కదా అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. అయినా దీపికా మాత్రం తనపై వచ్చిన ట్రోల్స్‌కు మౌనంగానే ఉన్నారు. అయితే సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ పెరిగిపోవడంతో అలీయా భట్‌తో పాటు జర్నలిస్టు ఫాయే డి సౌజా తన ఇన్‌స్టాగ్రాంలో దీపికకు మద్దతుగా నిలిచారు.

వ్యక్తిగత జీవితం గురించి కామెంట్స్ తగవు.. (Alia Bhatt)

తన పోస్ట్‌లో ఫాయే.. డియర్‌ సోషల్‌ మీడియా… దీపిక ప్రజాస్వామ్యయుతంగా తనకు లభించిన ఓటు హక్కును తన భర్తతో కలిసి వినియోగించుకున్నారు. ఆమె తన ప్రెగ్నసీ గురించి కానీ తన బాడీ గురించి కానీ మీ ఫీడ్‌బ్యాక్‌ అడిగారా ? .. ఆమె జీవితం గురించి కామెంట్‌ చేయడానికి మీకు హక్కులేదు. స్టాప్‌ ఇట్‌ … బీహెవ్‌ అంటూ మందలించారు. ఆమె పోస్ట్‌కు ఆలియాతో పాటు ఆలియా సోదరి పూజాభట్‌, షాహీన్‌ భట్‌ ఆమె తల్లి సోని రజ్దాన్‌ మద్దతు పలికారు. దీపికకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ఓ వర్గం ట్రోల్‌ చేస్తుంటే ఆమె ఫ్యాన్స్‌ మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచారు. చాలా మంది దీపికకు మద్దతుగా ఆలియా ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో దీపికకు అందరు మద్దతుగా నిలవాలి. ఆమె వ్యక్తిగత జీవితం గురించి కామెంట్లు చేయడం తగదని, దీపికతో పాటు బేబీ అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుందామని మరో ఫ్యాన్‌ రాశాడు. ఇక దీపిక, రణవీర్‌ల పెళ్లి అయ్యి ఆరు సంవత్సరాలు గడిచిపోయింది. ఇటీవల తన ప్రెగ్నెసీ గురించి వీరు ప్రకటించారు. బహుశా సెప్టెంబర్‌లో ఆమె డెలివరీ అయ్యే చాన్స్‌ ఉందని చెబుతున్నారు.

గతంలో అంటే 2022లో ఆలియా కూడా ప్రెగ్నసీ గురించి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. తన భర్త రణబీర్‌ కపూర్‌ తలపై (ఆమె సగం ఆల్ర్టాపౌండ్‌ .పెద్ద ఇమోజీ హార్ట్‌) పోస్ట్‌ చేశారు. అయితే ఓ న్యూస్‌ వెబ్‌సైట్‌ ఆమె ప్రెగ్నెసీ కారణంగా షూటింగ్స్‌లో జాప్యం ఏర్పడుతోందని.. రణబీర్‌కపూర్‌ లండన్‌ వెళ్లి ఆలియా తీసుకురావాలనే కామెంట్లు పెట్టింది. దీనిపై ఆలియా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్‌ పెట్టారు. ఇంకా కొంత మంది మన తలపై ఎక్కి స్వారీ చేస్తున్నారు. ఇంకా పితృస్వామ్య ప్రపంచంలో ఉన్నాము.. షూటింగ్స్‌లో ఎలాంటి జాప్యం జరగలేదు. తనను ఎవరు పికప్‌ చేయాల్సిన అవసరం లేదు. తాను మహిళను,పార్సిల్‌ కాదు. తనకు ఎలాంటి విశ్రాంతి అవసరం లేదు. మీకే డాక్టర్‌ సర్టిఫికేట్స్‌ కావాలంటూ చురకలంటించారు. ఇది 2022… మీ చెత్త ఆలోచనలు పక్కన పెట్టండి … ఇప్పుడు నన్ను వదిలేస్తే.. నా షాట్‌ రెడీగా ఉందంటూ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇదే పరిస్థితి దీపికకు ఏర్పడ్డంతో ఆలియా ఆమెకు అండగా నిలిచారు.