Home / సినిమా వార్తలు
అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పూర్తిగా గుంటూరు కారం మీద దృష్టి పెట్టారు. మహేష్ బాబు నటించిన మాస్ ఎంటర్టైనర్ ఈ సంవత్సరం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్ త్వరలో తన తదుపరి చిత్రంలో అల్లు అర్జున్‌తో కలిసి పని చేస్తారని వార్తలు వచ్చాయి.
2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ బయోపిక్‌గా యాత్ర చిత్రం విడుదలయింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా జగన్ మోహన్ రెడ్డికి ప్లస్ అయింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ చిత్రం ఫిబ్రవరి 8, 2024న థియేటర్లలోకి రానుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ చిత్రం దేవరతో బిజీగా ఉన్నాడు . ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ 80 శాతం షూటింగ్ పూర్తి చేశారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.
నటి రకుల్ ప్రీత్ సింగ్, ఆమె ప్రియుడు జాకీ భగ్నానీ త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. వీరిద్దరు రెండేళ్ల కిందటే తమ రిలేషన్ ను అధికారికంగా ప్రకటించిన విషయం తెలసిందే. అప్పటి నుంచి ఈ జంట పార్టీలు, ఈవెంట్లలో కలిసి కనిపిస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు గబ్బర్ సింగ్ ఫేమ్ శృతి హాసన్ నటించిన యాక్షన్ డ్రామా సలార్ మొదటిరోజునుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం దేశ విదేశాల్లో కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది.
హీరో నాని నటించిన ’హాయ్ నాన్న‘ చిత్రం జనవరి మొదటి వారంలో ఓటీటీ రిలీజ్ కు సిద్దమయింది. జనవరి 4 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుంది.
డీఎండీఏ పార్టీ అధినేత, ప్రముఖ తమిళ నటుడు విజయ్‌కాంత్ కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన చెన్నై ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. విజయకాంత్ కొంతకాలం క్రితం శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనని కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో చేర్పించారు.
రణబీర్ కపూర్ తాజా చిత్రం, యానిమల్ అతని కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తోంది. ప్రొడక్షన్ హౌస్ టి-సిరీస్ తాజా అప్డేట్ ప్రకారం యానిమల్ విడుదలైన ఐదు రోజుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 481 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. త్వరలో రూ.500 కోట్ల మార్కును దాటనుంది.
టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు చిన్న కొడుకు దగ్గుబాటి అభిరామ్ ఈరోజు లో శ్రీలంకలోపెళ్లి చేసుకోబోతున్నాడు. దీనికోసం కుటుంబ సభ్యులు, బంధువులు మొత్తం శ్రీలంకకు వెళ్లారు. మరియు హిందూ సంప్రదాయం ప్రకారం ఈ రోజు రాత్రి 8:50 గంటలకు అనంతర కలుతారాలో పెళ్లి జరగనుంది.
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కు ఫ్రెండ్ గా నటించిన జగదీశ్ పై పంజాగుట్ట పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. పంజాగుట్ట పరిధిలోనివాసముంటున్న ఒక యువతి గత నెల 29న ఆత్మహత్య చేసుకుంది.దీనికి సంబంధించి జగదీశ్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.