Hanu-Man Movie: హనుమాన్ @రూ.220 కోట్లు..
తేజ సజ్జా- ప్రశాంత్ వర్మల కాంబినేషన్లో సంక్రాంతికి విడుదలయిన హనుమాన్ మూవీ బాక్సాఫీసు వద్ద కలెకన్లలో దూసుకుపోతోంది. కేవలం విడుదలయిన 10 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో ఈ చిత్రం ఐదవ స్దానంలో నిలిచింది.
Hanu-man Movie: తేజ సజ్జా- ప్రశాంత్ వర్మల కాంబినేషన్లో సంక్రాంతికి విడుదలయిన హనుమాన్ మూవీ బాక్సాఫీసు వద్ద కలెకన్లలో దూసుకుపోతోంది. కేవలం విడుదలయిన 10 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో ఈ చిత్రం ఐదవ స్దానంలో నిలిచింది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి నైజాంలో కలెక్షన్లు బాగా పెరిగాయి. హనుమాన్ మొదటి వారంలో నైజాంలో చాలా తక్కువ ధియేటర్లలో విడుదలైంది. రెండవ వారం వచ్చేసరికి ధియేటర్లు,వసూళ్లు కూడా పెరిగాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్లు రూ. 100 కోట్లు దాటాయి. కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఉత్తరాదిలో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం కూడా ఈ చిత్రానికి మంచి ఊపు తెచ్చింది. బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, దీపికా పదుకొనే యొక్క ఫైటర్ మినహా చెప్పుకోదగ్గ పెద్ద రిలీజులు లేవు. అందువలన హనుమాన్ రాబోయే రోజుల్లో వసూళ్ల సంఖ్యను మరింత పెంచుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
హనుమాన్ బాక్సాఫీస్ కలెక్షన్లు..( Hanu-Man Movie)
నైజాం: రూ. 50 కోట్లు (రూ. 27 కోట్ల షేర్),సీడెడ్: రూ. 11 కోట్లు (రూ. 7.75 కోట్ల షేర్),ఆంధ్రా: రూ. 49 కోట్లు (రూ. 25 కోట్ల షేర్),ఏపీ/తెలంగాణ: రూ. 110 కోట్లు (రూ. 60 కోట్ల షేర్),కర్ణాటక: రూ. 16.50 కోట్లు (రూ. 7.25 కోట్ల షేర్),ఉత్తర భారతదేశం: రూ. 41 కోట్లు (రూ. 16 కోట్ల షేర్),తమిళనాడు/కేరళ: రూ. 3.50 కోట్లు (రూ. 1.50 కోట్ల షేర్),ఇండియా: రూ. 171 కోట్లు (రూ. 85 కోట్ల షేర్)గా ఉంది.అంతర్జాతీయంగా, హనుమాన్ 5.75 మిలియన్ డాలర్లు, సుమారుగా (రూ. 50 కోట్లు) వసూలు చేసింది. దీనితో ప్రపంచ వ్యాప్తంగా రూ.220 కోట్లు కలెక్షన్లు వచ్చాయి.