Published On:

Best Post Office Schemes: పోస్ట్ ఆఫీస్‌లో అద్భుతమైన స్కీమ్‌లు.. తక్కువ పెట్టుబడితో లక్షల్లో రాబడి

Best Post Office Schemes: పోస్ట్ ఆఫీస్‌లో అద్భుతమైన స్కీమ్‌లు.. తక్కువ పెట్టుబడితో లక్షల్లో రాబడి

Best Post Office Schemes: పోస్ట్ ఆఫీస్ పథకాలు సురక్షితమైనవి, అంతే కాకుండా చాలా నమ్మదగినవి. పోస్ట్ ఆఫీస్‌లో పెట్టుబడి పెడితే.. తక్కువ రిస్క్‌తో మంచి రాబడిని పొందవచ్చు. ముఖ్యంగా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని ప్రజలకు పోస్ట్ ఆఫీస్ పథకాలకు ఆకర్షితులవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఈ పథకాల్లో చిన్న మొత్తం నుండి లక్షల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. అంతే కాకుండా ఇవి అధిక వడ్డీ రేట్లు, పన్ను ప్రయోజనాలు,పెట్టుబడి భద్రత వంటి ప్రయోజనాలను అందిస్తున్నాయి.

 

1. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ (Post Office Savings Account – POSA):
ఏదైనా బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ మాదిరిగానే.. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ కూడా రోజువారీ లావాదేవీలకు, పొదుపు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రస్తుతం సంవత్సరానికి 4% వడ్డీ రేటును అందిస్తుంది. ఇక్కడ పెట్టుబడి పెట్టే డబ్బు పూర్తిగా సురక్షితం. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ నుండి డబ్బులు కూడా ఈజీగా డ్రా చేసుకోవచ్చు.

 

2. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (National Savings Certificate – NSC):
NSC అనేది ఒక ఫిక్స్‌డ్-ఇన్‌కమ్ పెట్టుబడి పథకం. దీని మెచ్యూరిటీ పీరియడ్ 5 సంవత్సరాలు. ప్రస్తుతం ఇది మనం పెట్టిన పెట్టుబడికి సంవత్సరానికి 7.7% వడ్డీ రేటును అందిస్తుంది. దీంట్లో ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇది దీర్ఘకాలిక పొదుపు కోసం మంచి ఎంపిక.

 

3. కిసాన్ వికాస్ పత్ర (Kisan Vikas Patra – KVP):
KVP అనేది మీ పెట్టుబడిని నిర్ణీత కాలంలో రెట్టింపు చేసే పథకం. ప్రస్తుతం, 7.5% వడ్డీ రేటుతో, మీ పెట్టుబడి సుమారు 115 నెలల్లో (9 సంవత్సరాల 7 నెలలు) రెట్టింపు అవుతుంది. దీనికి ఎలాంటి గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. ఇది దీర్ఘకాలిక పెట్టుబడికి అనుకూలమైన పథకం.

 

4. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (Public Provident Fund – PPF):
PPF అనేది ఒక దీర్ఘకాలిక పెట్టుబడి, పొదుపు పథకం. దీని మెచ్యూరిటీ పీరియడ్ 15 సంవత్సరాలు. ప్రస్తుతం సంవత్సరానికి 7.1% వడ్డీ రేటును అందిస్తుంది. PPF EEE (Exempt-Exempt-Exempt) కేటగిరీ కిందకు వస్తుంది.

 

5. సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana – SSY):
ఇది ఆడపిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక ప్రత్యేక పథకం. ఆడపిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వారి పేరు మీద అకౌంట్ తీయవచ్చు. ప్రస్తుతం ఇది సంవత్సరానికి 8.2% వడ్డీ రేటును అందిస్తుంది. ఇది బాలికల విద్య, వివాహానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది.

 

6. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (Senior Citizens’ Savings Scheme – SCSS):
60 సంవత్సరాలు నిండిన సీనియర్ సిటిజన్ల కోసం ఈ పథకం ఉద్దేశించబడింది. ప్రస్తుతం ఇది సంవత్సరానికి 8.2% వడ్డీ రేటును అందిస్తుంది. పదవీ విరమణ పొందిన వారికి స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. అంతే కాకుండా సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

 

7. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (Monthly Income Scheme – MIS):
MIS అనేది ప్రతి నెలా స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారికి అనుకూలమైన పథకం. ప్రస్తుతం సంవత్సరానికి 7.4% వడ్డీ రేటును అందిస్తుంది. దీని మెచ్యూరిటీ పీరియడ్ 5 సంవత్సరాలు. ఇక్కడ పెట్టుబడి పెట్టిన వారికి ప్రతి నెలా వడ్డీ రూపంలో ఆదాయం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి: