Priyanka Chopra: అమెరికా కోడలికి అంత సీన్ ఉందా.. ?

Priyanka Chopra: బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా చాలాకాలం తరువాత సోషల్ మీడియాను ఒక ఆట ఆడుకుంటుంది. అందుకు కారణం SSMB29. ఏ ముహుర్తానా ఈ సినిమాలో పీసీ నటిస్తుంది అని గాసిప్ వచ్చిందో అప్పటి నుంచి అమ్మడు పాన్ ఇండియా లెవెల్లో చక్రం తిప్పడం మొదలుపెట్టింది.
బాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా మారిన ప్రియాంక.. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను వివాహమాడి అమెరికా కోడలిగా మారిపోయింది. పెళ్లి తరువాత బాలీవుడ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ప్రియాంక.. హాలీవుడ్ లో సినిమాలు చేయడం మొదలుపెట్టింది. అక్కడ కూడా అంత హైప్ ఏం రాకపోయినా.. అలా అలా నడిపిస్తూ వచ్చింది.
ఇక ఆసమయంలోనే ప్రియాంక చోప్రా పంట పండింది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న SSMB29 సినిమాలో హీరోయిన్ గా పీసీని సెలెక్ట్ చేశారు. అధికారిక ప్రకటన వచ్చిందో లేదో.. అందరి చూపు ప్రియాంక మీదనే పడ్డాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అమెరికా తో ఇండియా డైలీ సర్వీస్ చేస్తుంది. SSM29 మీద అభిమానులు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
SSMB29 లో ప్రియాంక.. మహేష్ సరసన కాకుండా విలన్ గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే.. ఈ సినిమా ఇంకా షూటింగ్ నే పూర్తిచేసుకోలేదు అప్పుడే ఈ అమెరికా కోడలు మరో సూపర్ ఛాన్స్ పట్టేసింది వార్తలు వినిపిస్తున్నాయి.
పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. త్రివిక్రమ్ AA22 సినిమా చేస్తున్న బన్నీ.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాచేస్తున్నాడు. గతంలో ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వినిపించినా..ఎట్టకేలకు మళ్లీ పట్టాలెక్కింది.అందుతున్న సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో వస్తున్న చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందని తెలుస్తోంది.
ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ.. ప్రియాంకకు అంత సీన్ లేదు అని అంటున్నారు.ప్రియాంక, బన్నీ వయస్సు సేమ్ అయినా కూడా అతనికంటే అమ్మడే పెద్దదిలా కనిపిస్తుంది. పక్కపక్కన ఉంటే అక్కాతమ్ముడు అనుకొనేలా కనిపిస్తారు. అది పక్కన పెడితే.. ప్రియాంకకు అంత బిజినెస్ కూడా ఏమి లేదు.
పెళ్లికి ముందే ప్రియాంక ఫామ్ లో ఉందేమో కానీ.. SSMB29 పుణ్యమా అని ఆమె మరోసారి అందరికీ తెల్సింది. ఇప్పటివరకు రామ్ చరణ్ తో తప్ప వేరే తెలుగు హీరో పక్కన కూడా పీసీ కనిపించలేదు. ఇవన్నీ చూస్తే.. అమ్మడు తెలుగుకు వర్క్ అవుట్ అవుతుంది అనిపించడం లేదని టాక్. ఒకవేళ SSMB29 తరువాత ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో కానీ, ఇప్పుడైతే ఆమెకు అంత లేదని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.