Last Updated:

TS PECET 2023: తెలంగాణ పీఈసెట్ 2023 షెడ్యూల్ రిలీజ్

తెలంగాణ పీఈసెట్ 2023 షెడ్యూల్ రిలీజ్ అయింది. బీపీఎడ్‌ ( B.PEd ), డీపీఎడ్( D.PEd )కోర్సుల్లో ప్ర‌వేశాల నిమిత్తం నిర్వ‌హించే టీఎస్ పీఈసెట్ ( TS PECET)నోటిఫికేష‌న్ ఈ నెల 13 న విడుద‌ల కానుంది.

TS PECET 2023: తెలంగాణ పీఈసెట్ 2023 షెడ్యూల్ రిలీజ్

TS PECET 2023: తెలంగాణ పీఈసెట్ 2023 షెడ్యూల్ రిలీజ్ అయింది. బీపీఎడ్‌ ( B.PEd ), డీపీఎడ్( D.PEd )కోర్సుల్లో ప్ర‌వేశాల నిమిత్తం నిర్వ‌హించే టీఎస్ పీఈసెట్ ( TS PECET)నోటిఫికేష‌న్ ఈ నెల 13 న విడుద‌ల కానుంది.

ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్న‌త విద్యా మండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ లింబాద్రి, శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీ వీసీ,

టీఎస్ పీఈసెట్ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ ఎస్ మల్లేశ్‌, మ‌హాత్మాగాంధీ, పాల‌మూరు యూనివ‌ర్సిటీల వీసీలు గోపాల్ రెడ్డి, ల‌క్ష్మీకాంత్ రాథోడ్ క‌లిసి విడుద‌ల చేశారు.

 

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..(TS PECET 2023)

అర్హులైన అభ్య‌ర్థులు ఈ నెల 15 నుంచి మే 6వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసుకోవాలి.

ఎస్సీ, ఎస్టీల‌కు రూ. 500, మిగ‌తా కేట‌గిరిల వారికి రూ. 900 గా ఫీజు నిర్ణ‌యించారు.

ఆల‌స్యం రుసుం రూ. 500తో మే 15 వ‌ర‌కు, రూ. 2000తో మే 20 వ‌ర‌కు, ఆల‌స్య రుసుం రూ. 5 వేల‌తో మే 25వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

మే 26 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. జూన్ 1 నుంచి 10వ తేదీ వ‌ర‌కు ఫిజిక‌ల్ టెస్టులు నిర్వ‌హించ‌నున్నారు.

జూన్ మూడో వారంలో ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. త‌దిత‌ర వివ‌రాల కోసం www.pecet.tsche.ac.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.