Last Updated:

JEE Main Admit Cards: జేఈఈ మెయిన్ సెషన్‌ 2 అడ్మిట్ కార్డులు విడుదల

దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరం ఎంట్రన్స్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ 2023 సెషన్‌ 2 కు సంబంధించి అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీత్వరలోనే విడుదల చేసింది.

JEE Main Admit Cards: జేఈఈ మెయిన్ సెషన్‌ 2 అడ్మిట్ కార్డులు విడుదల

JEE Main Admit Cards: దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరం ఎంట్రన్స్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ 2023 సెషన్‌ 2 కు సంబంధించి అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీత్వరలోనే విడుదల చేసింది. ఏప్రిల్‌ 6 నుంచి 12 తేదీల మధ్య జరిగే ఈ పరీక్షలు జరగనున్నాయి. అడ్మిట్ కార్డులను విద్యార్థులు www.nta.ac.in, https://jeemain.nta.nic.in అధికారిక వెబ్ సైట్ల నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా 3330 నగరాల్లో ఏప్రిల్ 6,8,10,11,12,13 తేదీల్లో జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష జరగనుంది. అదే విధంగా విదేశాల్లోని 15 సిటీల్లోనూ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షను 9.4 లక్షల మంది కి పైగా విద్యార్థులు హాజరవుతారు.

హెల్ప్ లైన్ సహాయంతో(JEE Main Admit Cards)

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 పరీక్ష కోసం అభ్యర్థులు ఫిబ్రవరి 8 నుంచి మార్చి 12 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకున్న విషయం తెలిసిందే. జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 అడ్మిట్‌కార్డును పొందడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే విద్యార్థులు NTA హెల్ప్‌లైన్‌ నంబర్‌ 011-40759000 నంబర్‌ను ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సంప్రదించవచ్చు. మరోవైపు, జేఈఈ మెయిన్‌లో టాప్‌ స్కోరు సాధించే 2,50,000 మంది విద్యార్థులు జూన్‌ 4న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ కోసం..(JEE Main Admit Cards)

jeemain.nta.nic.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
హోంపేజీలో జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డు 2023 సెషన్‌-2కు సంబంధించిన లింక్‌పై క్లిక్‌ చేయాలి.
మీ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్‌ చేసుకోవాలి.
జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డు స్క్రీన్‌పై కనబడుతుంది.
ఆ తర్వాత దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఓ కాపీని ప్రింటవుట్‌ తీసుకుని పెట్టుకోవాలి.
కార్డుపై మీరు పరీక్ష రాసే నగరం పేరు, ఇతర వివరాలన్నీ ఉన్నాయో, లేదో సరిచూసుకోవాలి.
ఏదైనా సమస్య ఉంటే jeemain@nta.ac.in.ద్వారా ఎన్‌టీఏకు ఇ-మెయిల్‌ చేయొచ్చు.

 

ఇవి కూడా చదవండి: