Last Updated:

Crime News: బాలికను గర్భవతిని చేసిన బాలుడు

బాధ్యత లేని జీవితం బాధలను తెప్పిస్తుంది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రేమల పేరుతో విలువైన జీవితాలకు విలువ లేకుండా చేసుకొంటున్నారు. ఓ మైనరు బాలిక గర్భం దాల్చిన విషయం కాస్తా పంచాయితీ పెద్దలకు చేరిన ఈ సంఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకొనింది.

Crime News: బాలికను గర్భవతిని చేసిన బాలుడు

Narayanapet : వివరాల్లోకి వెళ్లితే…నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో ఓ బాలిక 8వ తరగతి చదువుకొంటుంది. తన ఇంటికి ఎదురుగా నివాసముంటున్న 10వ తరగతి చదివే బాలుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రణయంగా మారి ఇద్దరూ శారీరకంగా ఒకటయ్యేంత సాన్నిహిత్యం ఇరువురి మద్య ఏర్పడింది. ఇదంతా బాలిక తన అవ్వ సంరక్షణలో ఉండగా చోటుచేసుకొనింది.

తల్లి తండ్రులు బతుకుదెరువు కోసం హైదరాబాదులో నివాసముంటున్నారు. బాలిక ప్రవర్తనలో వచ్చిన మార్పును గుర్తించి బాలికను కుటుంబసభ్యులు నిలదీసారు. విషయం కాస్తా తల్లి తండ్రులకు చెప్పడంతో వ్యవహారం ఊరి పెద్దల పంచాయితీ వరకు విషయం వెళ్లింది. అయితే బాలుడి కుటుంబం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాలిక తల్లి తండ్రులు వ్యవహరాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం బాలిక 7నెలల గర్భవతిగా ఉన్నట్లు స్ధానికుల సమాచారంతో తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి: