Home / బిజినెస్
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. అంబానీ కుటుంబాన్ని బెదిరిస్తూ ... రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి ఈ రోజు ఉదయం ఆగంతకుడు నాలుగు సార్లు ఫోన్ చేశాడు.
ఆహార ధరల్లో నియంత్రణ కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గిందని ప్రభుత్వ గణాంకాలు సూచిస్తున్నాయి. జూన్‌లో 7.75 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం జులైలో 6.75కి తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో, వినియోగదారుల ధరల సూచీ ( సీపీఐ ) ఆధారిత ద్రవ్యోల్బణం
ప్యాకేజ్డ్ ఫుడ్స్, బ్యూటీ, పర్సనల్ కేర్ మరియు క్విక్ సర్వీస్ రెస్టారెంట్ చైన్లు పెద్ద మెట్రోల కంటే చిన్న పట్టణాలు లేదా టైర్ 2 మరియు 3 మార్కెట్లలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ కంపెనీ నెస్లేచైర్మన్ సురేష్ నారాయణన్ తన రెండవ త్రైమాసిక ఆదాయానికి సంబంధించి క్లాస్ వన్ పట్టణాలు రెండంకెల వృద్ధిని సాధించామని తెలిపారు.
జాన్సన్ & జాన్సన్ తన ఐకానిక్ టాల్క్-ఆధారిత జాన్సన్ బేబీ పౌడర్ అమ్మకాలను 2023తో ప్రపంచవ్యాప్తంగా ముగించనున్నట్లు ప్రకటించింది. వివిధ దేశాల్లో చట్టపరమైనసవాళ్ల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ బేబీ పౌడర్ ఉత్పత్తులను నిలిపివేయాలని నిర్ణయించింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కనీసం పది క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలపై విచారణ జరుపుతోంది. ఇన్స్టంట్ లోన్ యాప్ కేసులో దర్యాప్తులో ఉన్న నిందితుల నేరాల ద్వారా రూ. 1,000 కోట్లకు పైగా నగదును లాండరింగ్ చేసినట్లు గుర్తించారని వాటిలో చాలా వరకు చైనా లింక్‌ను కలిగి ఉన్నాయని తెలుస్తోంది.
2023 మొదటి త్రైమాసికంలో12 ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపు రూ. 15,306 కోట్ల సంచిత లాభాన్ని ఆర్జించాయి,మునుపటి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ కాలంలో, ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు రూ.14,013 కోట్ల లాభాన్ని నమోదు చేశాయి.దీనితో 9. 2 శాతం వృద్ది నమోదయింది.
కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 10న రాష్ట్రాలకు పన్నుల పంపిణీ కింద రూ.1.17 లక్షల కోట్లను విడుదల చేసింది, ఇది సాధారణంగా బదిలీ అయ్యే దానికంటే రెట్టింపు."రాష్ట్రాల మూలధనం మరియు అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేయడానికి రాష్ట్రాలను బలోపేతం చేయడానికి ఇది భారత ప్రభుత్వ నిబద్ధత
ప్రస్తుత ఆర్దికసంవత్సరం మొదటి ఐదు నెలల్లో జనవరి నుండి మే 2022 వరకు టీ ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే ఏడు శాతం పెరిగాయని టీబోర్డు నివేదిక తెలిపింది. మొదటి సారిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రస్తుత ఐదు నెలల కాలంలో 13.17 మిలియన్ కిలోలు, రష్యా ఫెడరేషన్ 11.52 మిలియన్ల కిలోల టీని దిగుమతి చేసుకున్నాయి.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి రూ.6,148 కోట్ల నష్టాన్ని చవిచూసింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో, ఇది రూ.3,214 కోట్ల లాభాలు రావడం గమనార్హం.
భారతదేశంలోని కోల్‌కతాలో పుట్టి, యూరప్‌లో పెరిగిన 27 ఏళ్ల అంగనా మహేశ్వరి తన వెంచర్, వేగానోలజీ ద్వారా రీసైకిల్ ప్లాస్టిక్ సీసాలు ఉపయోగించి బ్యాగులను తయారీకి శ్రీకారం చుట్టారు. ఈ వర్షాకాలంలో భారతదేశంలో వీటి తయారీని ప్రారంభించాలని భావిస్తున్నారు. ' తోలు పరిశ్రమ సృష్టించిన పర్యావరణ సమస్యలను దృష్టిలో వుంచుకుని వీటిని తయారు చేయాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు.