Last Updated:

Tea exports: ఏడు శాతం పెరిగిన టీ ఎగుమతులు

ప్రస్తుత ఆర్దికసంవత్సరం మొదటి ఐదు నెలల్లో జనవరి నుండి మే 2022 వరకు టీ ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే ఏడు శాతం పెరిగాయని టీబోర్డు నివేదిక తెలిపింది. మొదటి సారిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రస్తుత ఐదు నెలల కాలంలో 13.17 మిలియన్ కిలోలు, రష్యా ఫెడరేషన్ 11.52 మిలియన్ల కిలోల టీని దిగుమతి చేసుకున్నాయి.

Tea exports: ఏడు శాతం పెరిగిన టీ ఎగుమతులు

Tea exports: ప్రస్తుత ఆర్దికసంవత్సరం మొదటి ఐదు నెలల్లో జనవరి నుండి మే 2022 వరకు టీ ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే ఏడు శాతం పెరిగాయని టీబోర్డు నివేదిక తెలిపింది. మొదటి సారిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రస్తుత ఐదు నెలల కాలంలో 13.17 మిలియన్ కిలోలు, రష్యా ఫెడరేషన్ 11.52 మిలియన్ల కిలోల టీని దిగుమతి చేసుకున్నాయి. మరో ప్రధాన కొనుగోలుదారు ఇరాన్, జనవరి నుండి మే 2022 వరకు 8.91 మిలియన్ కిలోలను దిగుమతి చేసుకుంది, గత ఏడాది ఇదే కాలంలో ఇది 7.58 మిలియన్ కిలోలు వుండటం గమనార్హం.

ఇతర ప్రధాన దిగుమతిదారులు యుఎస్ఎ 4.81 మిలియన్ కిలోలు, జర్మనీ 2.95 మిలియన్ కిలోల టీని దిగుమతి చేసుకున్నాయి..ప్రస్తుత త్రైమాసికంలో ఎగుమతుల మొత్తం విలువ రూ. 2,037.78 కోట్లుగా ఉంది,గత ఏడాది ఈ సమయంలో ఇది రూ. 1,901.63 కోట్ల గా వుంది.

ఇవి కూడా చదవండి: