Home / బిజినెస్
స్మార్ట్ ఫోన్ తయారీరంగంలోకి గూగుల్ కూడా ఎంట్రీ ఇస్తోంది. ఇండియాలో డిక్సన్ టెక్నాలజీస్ ఈ స్మార్ట్ ఫోన్లను తయారు చేసిపెడుతుంది. కాగా గూగుల్ ఫిక్సిల్ 8 స్మార్ట్‌ఫోన్ ధర రూ 50,000లపై మాటే. మార్కెట్లో ఈ ఫోన్ ఆపిల్‌తో పాటు స్యాంసంగ్కు పోటీ ఇవ్వబోతోంది
ద్విచక్ర వాహన దిగ్గజం హీరోమోటో కార్ప్ ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్లో కొత్త రకం మోడల్‌ను ప్రవేశపెట్టనుంది. కొత్త మోడల్ ధర విషయానికి వస్తే లక్షల రూపాయల కంటే తక్కువ రేటుకు విక్రయించనున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నెలకొంది. సోమవారం నాడు ఐదవ విడత పోలింగ్ జరుగుతోంది. ఇక మిగిలింది కేవలం రెండు విడతల పోలింగ్ మాత్రమే. ఇక అందరి దృష్టి స్టాక్ మార్కెట్లపై పడింది. ఇటీవల కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లో కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన జేపీ మోర్గాన్స్, సిటి బ్యాంకులాంటి అతి పెద్ద బ్యాంకులు ఇండియాకు కూడా కావాలని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం శుక్రవారం చెప్పారు. ఆర్థిక రంగంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఫోర్బ్స్ గురువారం నాడు 30 అండర్ 30 ఆసియా జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఏషియా - పసిఫిక్ రీజియన్‌లో మొత్తం 300 మంది యువ ఎంటర్‌ప్రెన్యుర్స్, లీడర్స్, ట్రెయిల్ బ్లేజర్స్ స్థానం దక్కించుకున్నారు. వీరంతా వివిధరకాల వినూత్న వ్యాపారాలు, పరిశ్రమల వ్యవస్థాపకులు.
ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను ఈ నెల 15 నుంచి పెంచింది. వివిధ కాల పరిమితులపై 25 నుంచి 75 బేసిస్ పాయింట్లు లేదా 0.25 శాతం నుంచి 0.75 శాతం వరకు రూ.2 కోట్లు అంత కంటే తక్కువ మొత్తానికి వడ్డీరేట్లను పెంచింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి ఎగుమతులు రికార్డు బద్దలు కొట్టాయని ఆర్థికమంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 778 బిలియన్ డాలర్లుగా నమోదు కాగా.. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 776.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
దేశ ప్రజల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ బలపడే కొద్ది ప్రజలు లగ్జరీ వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఐదవ స్థానంలో నిలిచింది. ఆర్థిక వ్యవస్థ బలపడినప్పుడు దేశ ప్రజల చేతిలో పెద్ద ఎత్తున డబ్బు అడుతున్నట్లు లెక్క. సంపన్నదేశాల్లో లభించే కార్లు కూడా మన దేశంలో లభిస్తున్నాయి.
భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను టాటా గ్రూపు టేకోవర్ చేసి ప్రస్తుతం లేనిపోని ఇబ్బందులు పడుతోంది. సిబ్బంది కొరతతో విమానాలను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ముందుగా టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులు చివరి నిమిషంలోవిమానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఎయిర్ ఇండియా యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ రిస్క్‌తో కూడుకున్న విషయం తెలిసిందే. అయితే ఏస్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝన్‌ఝన్ వాలా గురించి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారికి బాగా తెలిసే ఉంటుంది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య రేఖ కంపెనీ పగ్గాలు చేపట్టారు. ఆమె కూడా స్టాక్‌లో మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి బాగానే అనుభవం సంపాదించారు.