Last Updated:

Anil Ambani: చిక్కుల్లో అనిల్‌ అంబానీ.. .రూ. 2599 కోట్లు చెల్లించాలని అనిల్ అంబానీ సంస్దకు ఢిల్లీ మెట్రో నోటీసులు

ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్‌ అంబానీ మరో సారి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే దివాలా తీసిన జూనియర్‌ అంబానీపై మరో మారు పిడుగుపడే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకు అసలు విషయానికి వస్తే...ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కు అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (డీఏఎంఈపీఎల్‌) మధ్య ఒక ఒప్పందం కుదిరింది.

Anil Ambani: చిక్కుల్లో అనిల్‌ అంబానీ.. .రూ. 2599 కోట్లు చెల్లించాలని అనిల్ అంబానీ సంస్దకు  ఢిల్లీ మెట్రో నోటీసులు

Anil Ambani: ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్‌ అంబానీ మరో సారి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే దివాలా తీసిన జూనియర్‌ అంబానీపై మరో మారు పిడుగుపడే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకు అసలు విషయానికి వస్తే…ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కు అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (డీఏఎంఈపీఎల్‌) మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ నుంచి సెక్టార్‌ 21 ద్వారక వరకు డిజైన్‌, ఇన్‌స్టాల్‌, కమిషన్‌, ఆపరేట్‌, మెయిన్‌టెనెన్స్‌ కాంట్రాక్టు దక్కించుకుంది. దీనికి గాను 30 సంవత్సరాల పాటు అనిల్‌ అంబానీకి చెందిన కంపెనీ ఢిల్లీ మెట్రోతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇదిలా ఉండగా 2012లో అనిల్‌ అంబానీకి చెందిన కంపెనీ ఈ ఒప్పందాన్ని ఢిల్లీ మెట్రోతో తెగతెంపులు చేసుకుంది. దీనికి కొన్ని సాంకేతికపరమైన కారణాలు చూపించింది. వయాడక్ట్‌లో కొన్ని లోపాలున్నాయని దీనికి ఢిల్లీ మెట్రోనే బాధ్యత వహించాలని చిన్నగా జారుకుంది. అయితే అదే ఏడాది చివర్లో అనిల్‌ కంపెనీ కాంట్రాక్టు టెర్మిమినేషన్‌ నోటీసు జారీ చేసింది. దీంతో అధికారులు నవంబర్‌ 2012లో అనిల్‌ కంపెనీ చెప్పిన లోపాలపై ఇన్స్‌పెక్షన్‌ జరిపించింది.

ఆ ఇన్స్‌పెక్షన్‌ తర్వాత జనవరి 2013లో అనిల్‌ కంపెనీ తిరిగి పనులు ప్రారంభించింది. పనులు ప్రారంభించిన ఐదు నెలల తర్వాత ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నామంటూ మరోమారు అనిల్‌ కంపెనీ చేతులు ఎత్తేసింది. అకస్మాత్తుగా కాంట్రాక్టు రద్దు చేసినందుకు ఢిల్లీ మెట్రో అనిల్‌ కంపెనీకి వ్యతిరేకంగా ఆర్బిట్రేషన్‌ ట్రైబ్యునల్‌కు వెళ్లింది. కాగా ఆర్బిట్రేషన్‌ ట్రైబ్యునల్‌ అనిల్‌ అంబానీకి చెందిన డీఏఎంఈపీఎల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వెంటనే ఢిల్లీ మెట్రోను అనిల్‌ కంపెనీకి రూ.2,782.33 కోట్లు చెల్లించాలని 2017లో తీర్పు ఇచ్చింది. ట్రైబ్యునల్‌ ఆదేశాను సారం డీఎంఆర్‌సీ యాక్సిస్‌ బ్యాంకు లిమిటెడ్‌ మెయిన్‌టెన్‌ చేస్తూ ఎస్క్రో ఖాతాలో రూ.2,599 కోట్లు జమ చేసింది.

15 రోజుల్లోగా చెల్లించాలి..(Anil Ambani)

ప్రస్తుతం ఢిల్లీ మెట్రో ఈ డబ్బును 15 రోజుల్లో ఢిల్లీ చెల్లించాలని అనిల్‌ అంబానీకి చెందిన కంపెనీకి లీగల్‌ నోటీసు పంపించింది. దీంతో పాటు ఎస్‌బీఐ ప్రైమ్‌ లెండింగ్‌ రేటు రెండు శాతం కలిపి మొత్తం 15 రోజుల్లోగా చెల్లించాలని నోటీసులో పేర్కొంది. లేదంటే అనిల్‌ అంబానీ కంపెనీపై కోర్టుధిక్కార కేసును ఫైల్‌ చేస్తామని హెచ్చరించింది. కాగా ట్రైబ్యునల్‌ అనిల్‌ అంబానీకి అనుకూలంగా ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనపెట్టి.. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సమర్థించింది. కాగా హైకోర్టు ఢిల్లీ మెట్రోకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. డీఎంఆర్‌ఎస్‌ అంటే ఢిల్లీ మెట్రో డిపాజిట్‌ చేసిన రూ.2,599 కోట్లు రిఫండ్‌ చేయాలని ఆదేశించింది. ఇదే విషయాన్ని చీఫ్‌ జస్టిస్‌ఆఫ్‌ ఇండియా డీవై చంద్రచూడ్‌ కూడా సమర్థించారు. దీంతో అనిల్‌ ఢిల్లీ మెట్రోకు 15 రోజుల్లో రూ.2,599 కోట్లతో పాటు రెండు శాతం వడ్డీ కలిపి చెల్లించాల్సి ఉంటుంది.

పీకల్లోతు అప్పుల్లో అనిల్ అంబానీ..

ప్రస్తుతం అనిల్‌ అంబానీ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. ఆయన కంపెనీలన్నీ దివాలా తీశాయి. మొబైల్‌ ఫోన్ల తయారి సంస్థ ఎరిక్‌సన్‌ కేసులో సుప్రీంకోర్టు అనిల్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. రూ.500 కోట్లు ఎరిక్‌సన్‌కు చెల్లించండి లేదా.. జైలుకు వెళ్లండి అని ఆదేశించడంతో ఆ సమయంలో ముఖేష్‌ భార్య నీతా అంబానీ రూ.500 కోట్లు సర్దుబాటు చేయడంతో జైలు శిక్ష నుంచి తప్పించుకున్నాడు. మరి ఈ సారి అనిల్‌ను ఎవరు ఆదుకుంటారో వేచి చూడాల్సిందే.

 

ఇవి కూడా చదవండి: