Niti Aayog CEO: మోర్గాన్ స్టాన్లీ, సిటి బ్యాంకులాంటి పెద్ద బ్యాంకులు కావాలి..!నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం
అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన జేపీ మోర్గాన్స్, సిటి బ్యాంకులాంటి అతి పెద్ద బ్యాంకులు ఇండియాకు కూడా కావాలని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం శుక్రవారం చెప్పారు. ఆర్థిక రంగంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
Niti Aayog CEO: అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన జేపీ మోర్గాన్స్, సిటి బ్యాంకులాంటి అతి పెద్ద బ్యాంకులు ఇండియాకు కూడా కావాలని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం శుక్రవారం చెప్పారు. ఆర్థిక రంగంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. న్యూఢిల్లీలో ఆయన సీఐఐ వార్షిక బిజినెస్ సమ్మిట్ 2024లో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. జేపీ మోర్గాన్, సిటిబ్యాంకులాంటి అతి పెద్ద బ్యాంకులు మన ఇండియాలో కూడా ఉండాలన్నారు. మన దేశీయ బ్యాంకులు ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన బ్యాంకులు సేవలందించాలన్నారు.
అతిపెద్ద సంస్కరణలు రావాలి.. (Niti Aayog CEO)
దీని కోసం మరోమారు ఆర్థిక రంగంలో అతి పెద్ద సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇండియాలో మొట్టమొదటిసారి 1991లో 1994లో సంస్కరణలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే.దీంతో అప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో ఇండియా సభ్యత్వం దక్కించుకుంది. దీని వల్ల ఇండియాలో పారిశ్రామికంగా అభివృద్ది చెందడానికి దోహద పడింది.. ప్రస్తుతం దేశంలో ఉన్న 90 శాతం కంపెనీలు పురోభివృద్ది చెందడానికి ప్రధాన కారణం అప్పుడు తెచ్చిన సంస్కరణలే అని ఆయన అన్నారు. ఏ రంగంలో అయినా పోటీ ఉంటే అభివృద్ది చెందవచ్చు. దీంతో పాటు డై లైసెన్సింగ్ వల్ల కూడా పారిశ్రామికంగా అభివృద్ది చెందాయని చెప్పారు. ప్రస్తుతం చేయాల్సింది కూడా ఏమీలేదన్నారు సుబ్రహ్మణ్యం. అయితే అప్పడు తెచ్చిన సంస్కరణల వల్ల కొన్ని కంపెనీలు మూతపడ్డ విషయం గురించి ఆయన ప్రస్తావించారు.
సంస్కణలు తేవడం వల్ల కొన్ని కంపెనీలు మాయం అయితే.. వాటి స్థానంలో లెక్కలేనన్ని కంపెనీలు వచ్చాయన్నారు. ఇక సంస్కరణలు తేవాల్సింది ఎడ్యుకేషన్, స్కిల్ రంగాల్లో అని చెప్పారు. ఇక ఇండియా లేబర్ ఇన్‌టెన్సివ్ సెక్టార్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించింది. పారిశ్రామిక విప్లవం వల్ల దేశంలో పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తోంది. ఆర్థికంగా దేశం అభివృద్ది పథంలో దూసుకుపోతోందని ఆయన సీఐఐ వార్షిక సదస్సులో మాట్లాడుతూ అన్నారు.