Home / బిజినెస్
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షలో రిజర్వుబ్యాంకు కీలక ... రేపో రేటును యధాతథంగా కొనసాగించడానికి నిర్ణయించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో జరిగిన ద్రవ్యపరపతి సమీక్ష 4:2 మెజారిటీతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
లోకసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు కుప్పకూలాయి. ఇండియాలో అత్యంత సంపన్నులు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీలు బిలియన్ల కొద్ది డాలర్ల సంపద కోల్పోయారు.
దేశంలో ఏడవ విడత పోలింగ్ ముగిసిన వెంటనే పాల ధరకు రెక్కలు వచ్చాయి. దేశంలోని అతి పెద్ద మిల్క్ కో ఆపరేటివ్‌లు అమూల్, మథర్‌డెయిరీలు వరుసగా లీటరుకు రూ.2 చొప్పున జూన్ 3 నుంచి పెంచేశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఆకాశమే హద్దుగా సోమవారం నాడు దూసుకుపోయాయి. కేంద్రంలో మరోమారు ఎన్డీఏ ప్రభుత్వం సునాయాసంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని దాదాపు అన్నీ ఎగ్జిట్‌పోల్స్ చెప్పడంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లు కొనుగోలు చేశారు.
లోకసభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అందరి ఫోకస్ అదానీ గ్రూపు షేర్లపై పడింది. ఎందుకంటే గతంలో జరిగిన లోకసభ ఎన్నికల తర్వాత అదానీ షేర్లు అమాంతంగా పెరిగి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
పేటియం వ్యస్థాపకుడు విజయశేఖర వర్మకు చెందిన షేర్లు గత కొన్ని రోజుల నుంచి నేల చూపులు చూస్తున్నాయి. కరోనా సమయంలో ఐపీవోకు వచ్చిన పేటీయం మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు సేకరించింది. ఒక్కోషేరు రూ.2,080లు విక్రయించింది.
మార్కెట్ ఎనలిస్టుల అంచనాలను తారుమారు చేస్తూ గత ఆర్థిక సంవత్సరం నాలుగ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి లేదా జీడీపీ ఏకంగా 7.8 శాతం నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికిచూస్తే జీడీపీ 8.2 శాతం నమోద్యే అవకాశం ఉందని కేంద్ర గణాంకాల కార్యాలయం అంచనా వేసింది.
పోలింగ్‌కు ఒక్క రోజు ముందు అంటే శనివారం నాడు చివరి విడత లోకసభ పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో ఇటు సెన్సెక్స్‌తో పాటు నిఫ్టీ కూడా ఒక శాతం వరకు క్షీణించాయి.
వచ్చే శనివారంతో లోకసభ ఎన్నికలు ముగియబోతున్నాయి. అదే రోజు ఎగ్జిట్ పోల్స్ వెలువడుతాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎన్ని సీట్లు సాధిస్తుందనే విషయం అదే రోజు దాదాపు తేలిపోతుంది.
దేశంలో అందుబాటు ధరలో లభించే ఇళ్ల నిర్మాణాలు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. రూ.60 లక్షలు అంత కంటే తక్కువ విలువ చేసే ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి రియల్ ఎస్టేట్ డెవలపర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు చూస్తే దేశంలోని అతి పెద్ద ఎనిమిది నగరాల్లోని గణాంకాలను తీసుకుంటే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి.