Home / బిజినెస్
ఇకపై ట్విటర్ లో సినిమాలు, గేమ్స్ నెట్టింట హల్ చేయనున్నాయి. ఆ దిశగా ట్విటర్ అధినేత ఎలన్ మాస్క్ పావులు కదుపుతున్నారు. మరో వైపు ఇప్పటివరకు ఉన్న ట్విటర్ అడ్వర్టైజ్మెంట్ పాలసీని కూడా మార్పులు చేసేందుకు అన్ని ఏర్పాట్లు ఎలన్ మస్క్ చేసుకొన్నట్లు తెలుస్తుంది.
గతంలో 'ఫేస్‌మోజీ' అని పేరు పెట్టబడిన ట్విట్టర్ మద్దతు గల అవతార్ స్టార్టప్ ఆల్టర్‌ను గూగుల్ కొనుగోలు చేసింది. రెండు నెలల క్రితం ఆల్టర్ కొనుగోలు పూర్తయింది. గూగుల్ నిన్న (గురువారం) కొనుగోలును అధికారికంగా ధృవీకరించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు బీఎస్స్ఈ, ఎన్ఎస్ఈ లు లాభాలతో ముగిశాయి. వారం చివరి రోజున ఇన్వెస్టర్ల నుండి మద్దతు లభించడంతో సెన్సెక్స్ సూచీలు లాభాలు అందుకొన్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 203.01 పాయింట్లు లాభపడి 59,959.85 వద్ద ముగిసింది.
ట్విట్టర్‌ని 44 బిలియన్ల డాలర్లకు టేకోవర్ చేసిన తర్వాత, బిలియనీర్ ఎలోన్ మస్క్ ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ మరియు ఇతర ఉన్నతాధికారులను తొలగించారు.
ప్రధాన నగరమైన విజయవాడలో పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ 47,100 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ 51,280 గా ఉంది. విజయవాడలో వెండి ధర చూసుకుంటే కేజీ రూ 64,500 గా ఉంది.
ఎలాన్ మస్క్ ట్విటర్ ను ఎట్టకేలకు సొంతచేసుకున్నాడు. గత కొన్ని నెలలుగా జరుగుతున్న చర్చల అనంతరం డీల్ గురువారంతో పూర్తయింది. 44 బిలియన్ డాలర్లకు ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేశారు. అయితే ముందునుంచి అనుకుంటున్నట్టుగానే వచ్చీరాగానే మస్క్ తనను తప్పుదారి పట్టించాడని ఆరోపించిన కంపెనీ సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను మరియు టాప్ ఎగ్జిక్యూటివ్‌లను బాధ్యతల నుంచి తప్పించారు.
ద్రవ్యోల్బణం పెరిగిపోతుండడంతో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకొనింది. నవంబర్ 3న మానిటరీ పాలసీ కమిటి (ఎంపీసీ) భేటిని బెంగళూరులో నిర్వహించనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
ఒకరు ఒక సమయానికి ఒక ఆర్ట్ గీస్తారు. మహా అద్భుత ప్రతిభావంతులు అయితే రెండు చేతులూ, రెండు కాళ్లు, నోరు ఉపయోగించి పెయింటింగ్ వెయ్యడం చూసి ఉంటాం. కానీ ఒంటి చేత్తో ఒకేసారి ఒకే సమయంలో 15 చిత్రాలను గియ్యడం మీరెక్కడైనా చూశారా.. చూడలేదు కదా. అయితే ఇప్పుడు ఈ వీడియో చూసెయ్యండి.
పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను శాఖకు రిటర్న్‌ను దాఖలు చేయడం తప్పనిసరి. కాగా పన్ను కట్టడానికి ప్రభుత్వం ఒక గడువును నిర్ణయిస్తుంది. ఆ గడువులోగా పన్ను చెల్లింపుదారులు పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం 2022-23 అసెస్‌మెంట్ సంవత్సరానికి గానూ పన్ను చెల్లింపు గడువును పెంచింది.
ట్విట్టర్ కొనుగోలుకు ఎట్టకేలకు మస్క్ మొగ్గు కనపరుస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్‌కోలో ఉన్న ట్విట్టర్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఇంత వరకూ బాగానే ఉన్న ఆయన ట్విట్టర్ ఆఫీసుకు వెళ్తూ తన చేతిలో సింక్ పట్టుకుని వెళ్లారు.