Last Updated:

UNESCO Honour: వరంగల్ కు యునెస్కో గుర్తింపు..

చారిత్రక నగరం వరంగల్ కు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌లో వరంగల్ చేరిందంటూ కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం రాత్రి ట్వీట్ చేశారు.

UNESCO Honour: వరంగల్ కు యునెస్కో గుర్తింపు..

Warangal: చారిత్రక నగరం వరంగల్ కు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌లో వరంగల్ చేరిందంటూ కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వ సంపదను ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా నిరంతరం కృషి చేస్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

దీనిపై తెలంగాణ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతోషం వ్యక్తం చేస్తూ ఓరుగల్లుు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గుర్తింపు కోసం కృషి చేసిన సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్‌కు, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులకు దయాకర్‌రావు ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రసిద్ధ రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ఇప్పటికే గుర్తించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తెలంగాణలోని వరంగల్‌కు ఏడాది వ్యవధిలోనే యునెస్కో నుంచి మరో గుర్తింపు లభించింది. అరుదుగా చెప్పుకొనే యునెస్కో గుర్తింపును ఏడాదికాలంలో రెండుసార్లు సాధించడం ఈ నగరానికి ఉన్న ప్రత్యేకత.

 

ఇవి కూడా చదవండి: