Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దేశవ్యాప్తంగా ఈడీ దాడులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్త దాడులు చేపట్టింది. ఆ కేసుతో లింకు ఉన్న 35 ప్రదేశాల్లో ఈరోజున ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. నిందితుడు సమీర్ మహేంద్రు ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి.
New Delhi: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్త దాడులు చేపట్టింది. ఆ కేసుతో లింకు ఉన్న 35 ప్రదేశాల్లో ఈరోజున ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. నిందితుడు సమీర్ మహేంద్రు ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. గురుగ్రామ్, లక్నో, హైదరాబాద్, ముంబయి, బెంగుళూరులోనూ ఈడీ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ మాజీ ఎక్సైజ్ కమీషనర్ అరవ గోపీ కృష్ణ ఇంట్లోనూ ఇటీవల ఈడీ సోదాలు చేపట్టింది. కొత్త అబ్కారీ విధానం అమలు జరగకుండా లిక్కర్ మాఫియా అడ్డుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసులో సీబీఐ ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు మనీ ల్యాండరింగ్ కేసును బుక్ చేసే అవకాశాలు ఉన్నాయి. రాబిన్ డిస్టిలర్స్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్న బెంగళూరుతో పాటు హైదరాబాద్ లో వ్యాపారం నిర్వహిస్తున్న రామచంద్రన్ పిళ్లై ఇంట్లో కూడ సోదాలు జరుగుతున్నాయి.