Home / బ్రేకింగ్ న్యూస్
రాష్ట్రానికి మంచి చేయాలన్నదే తన అభిలాష అని గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ అన్నారు. తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్ భవన్ లో నేడు ఆమె ప్రసంగించారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను సినీనటి దివ్య వాణి కలిశారు. హైదరాబాద్ శామీర్ పేటలో ఉన్న ఈటల నివాసానికి ఆమె వెళ్లారు. ఈరోజు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కలవడం పట్ల ఆసక్తి నెలకొంది.
దేశాన్ని రక్షించుకోవడం అనేది కత్తి మీద సాము లాంటిది. ఇందుకోసం లక్షలాది మంది సైనికులు నిరంతరం పహారా కాస్తుండడం ఒక వంతైతే, దేశ రక్షణకు సంబంధించిన సాంకేతిక, ఆయుధాలు, వాహనాలు, రాకెట్లు, మిస్సైల్స్ వంటి తయారీ కూడా ఎంతో కీలకం.
రుణం, రుణం ఈ మాటలు సామాన్యుడి దగ్గర నుండి బడా బడా పారిశ్రామిక వేత్తల వరకు నిత్యం వారి వారి లావాదేవీలకు అవసరమైన మాటలే. అవసరాన్ని క్యాష్ చేసుకొనేందుకు మార్కెట్టులో రుణయాప్ లు వీధికొకటి వెలవడం. ఫైనాన్స్ కోసం ఎదురుచేసే వారికి అభయహస్తం మా సంస్ధ అంటూ నమ్మించడం. ఇది అందరికి తెలిసిందే.
హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం పై వివాదం తొలగిపోయింది. రేపటి నిమజ్జనాలకు ట్యాంక్ బండ్ పై జిహెచ్ఎంసి అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనాల కోసం ఏకంగా 15 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గంలో 9, పీవీ మార్గ్ లో 8 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్లోని కత్రాలో గురువారం ఉదయం రిక్టర్ స్కేలు పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తన నివేదికలో పేర్కొంది. కత్రా కు 62 కిమీ తూర్పు-ఈశాన్యం దిశగా ఉదయం 07:52 గంటలకు సంభవించింది.
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిలేని వానలు కురుస్తున్నాయి. కాగా చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వరద నీటి ఉద్ధృతి కొనసాగుతుంది. ఎగువ నుంచి వస్తోన్న వరదనీటి ప్రవాహాన్ని తాళలేక సాగర్ ఎడమ కాలువకు గండి పడింది.
దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 1 వరకు అన్ని రకాల బాణాసంచా తయారీ, అమ్మకం, వినియోగం పై నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ బుధవారం తెలిపారు.అన్ని రకాల పటాకుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకం మరియు వినియోగం పూర్తిగా నిషేధించబడింది.
అనేక వాయిదాల అనంతరం నేడు జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశం ముగిసింది. అయితే ఈ సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మంత్రి వేణుగోపాలకృష్ణ మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ భేటీలో మొత్తం 57 ఆంశాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇకపై కారులో వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తులు కూడ సీటు బెల్ట్ ధరించాలి. లేకుంటే వారు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే మూడు రోజుల్లో విడుదల చేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం తెలిపారు.