Last Updated:

TTD governing council: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలివే..

టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాలకమండలి పలు నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఆస్తుల విలువ రూ.85,700 కోట్లుగా నిర్దారించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

TTD governing council: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలివే..

Tirumala: టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాలకమండలి పలు నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఆస్తుల విలువ రూ.85,700 కోట్లుగా నిర్దారించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన వాటినే శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించాలని టీటీడీ పాలకమండలిలో నిర్ణయించినట్లు తెలిపారు. నందకం అతిథి గృహం పునరుద్ధరణకు 2.45 కోట్లు కేటాయింపు, సామాన్య భక్తులకు కేటాయించే గదుల అభివృద్ధికి రూ.7.20 కోట్లు, నెల్లూరు శివార్లలో ఉన్న రెండు ఎకరాలలో ఆలయం, కళ్యాణ మండపం నిర్మాణానికి రూ. 9 కోట్లు, తిరుపతి ఆర్ట్స్ కాలేజీ అభివృద్ధికి రూ.6.30 లక్షలు టీటీడీ కేటాయించింది. అర్హులైన టీటీడీ ఉద్యోగుల ఇండ్ల స్థలాల కోసం రూ.60 కోట్లు చెల్లించి 300 ఎకరాలు సేకరించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రూ.25 కోట్లతో ఇంకో 129 ఎకరాల‌ కొనుగోలు పై చర్చించామన్నారు. తిరుపతిలో టైం స్లాట్ టోకెన్లు ఇవ్వడానికి నిర్ణయించామన్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు సమయాల్లో మార్పు చేయాలని టీటీడీ నిర్ణయించింది.

టైం స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ పునరుద్ధరణ చేసి పెరటాసి మాసం అనంతరం తిరుపతిలో భక్తులకు సర్వదర్శనం టోకన్లు పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం. వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో మార్పులు చేయాలని బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం 10 గంటల తరువాత వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభించాలని యోచిస్తున్నాం. పూర్తి స్థాయిలో బ్రేక్ దర్శనాలపై ప్రయోగాత్మకంగా పరిశీలించిన తరువాత అమలు చేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. ఎలాంటి టోకెన్లు, టిక్కెట్లు లేక పోయినా భక్తులను సర్వదర్శనం అనుమతించే విధానం యధావిధిగా కొనసాగుతుందన్నారు.

ఇవి కూడా చదవండి: