Home / బ్రేకింగ్ న్యూస్
తెలంగాణకు మరోసారి రెయిన్ అలెర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. వర్షాలు ప్రజలను మరల ఇబ్బంది పెట్టనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వానల ధాటికి పలుచోట్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ తరుణంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తమ వెబ్ సిరీస్ ‘XXX’ సీజన్ 2లో భారతీయ ఆర్మీ సైనికులను అవమానించి, వారి కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీసినందుకు సినీ మరియు టెలివిజన్ నిర్మాత ఏక్తా కపూర్ మరియు ఆమె తల్లి శోభా కపూర్లకు బీహార్‌లోని బెగుసరాయ్‌లోని స్థానిక కోర్టు బుధవారం అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.
మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) కేసులో తీర్పును వెలువరించే సమయంలో మహిళలందరికీ అబార్షన్‌ను ఎంచుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది.
జమ్ముకశ్మీర్‌లోని వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ అనుమానాస్పద బ్లాస్ట్ లు స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలను కలిగిస్తున్నాయి. ఉధంపూర్‌లో గంటల వ్యవధిలోనే రెండుసార్లు పేలుళ్లు సంభవించాయి. వీటిపై అధికారులు ఆరా తీరుస్తున్నారు.
వారిరువు వరుసకు అన్నా చెల్లెళ్లు. ఆ ఇద్దరి వయసు 15 ఏళ్లే. పాఠశాలకు వెళ్లివస్తోన్న క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దానితో బాలిక గర్భం దాల్చింది. తీరా చూస్తే ఏడునెలల గర్బం అని తెలిసి భయపడి పారిపోయి భాగ్యనగరానికి చేరుకున్నారు. ఈ ఉదతం బిహార్‌లో చోటుచేసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలోని 416 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా క్లినిక్ లు, ఆస్పత్రులను తనిఖీలు చేస్తున్నామన్నారు.
ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PM-GKAY) పథకాన్ని డిసెంబర్ 2022 వరకు మూడు నెలల పాటు పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇండో స్పిరిట్స్ యజమాని సమీర్ మహేంద్రుని అరెస్ట్ చేసింది. రాజేంద్ర ప్లేస్‌లోని యూకో బ్యాంకు ఖాతాకు కోటి రూపాయలు బదిలీ చేసినట్లు మహేంద్రుపై ఆరోపణలు వచ్చాయి
దేశవ్యాప్తంగా రెండు రౌండ్ల దాడులు మరియు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ( పిఎఫ్ఐ) కు చెందిన 240 మంది సభ్యులని అరెస్టు చేసిన తరువాత కేంద్రం తీవ్రవాద కార్యకలాపాల ఆరోపణల పై ఐదేళ్ల పాటు పిఎఫ్ఐ ను నిషేధించింది.
ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సు, లారీ ఒకదానికి ఒకటి ఢీ కొట్టడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందగా మరో 25 మంది గాయపడ్డారు.