Home / బ్రేకింగ్ న్యూస్
ఓ మహిళపై అత్యాచారం, హత్యాయత్నం, కిడ్నాప్ ఆరోపణలపై సస్పెండ్ అయిన మారేడ్ పల్లి మాజీ వలయాధికారి నాగేశ్వరావుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరాదేవి మృతి పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేసారు.
మహేశ్ బాబు తల్లి, సూపర్ స్టార్ కృష్ణ భార్య ఇందిరా దేవి కాలంచేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో భాధపడుతున్న మహేశ్ బాబు తల్లి ఇవాళ తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు.
మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ధాకరేకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. నిజమైన శివసేనను నిర్ణయించే అధికారాన్ని ఎన్నికల కమిషన్ చర్యలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది
డీజే టిల్లు సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఈగర్‌గా ఎదురు చూస్తున్న తరుణంలో చిత్ర బృందం తీపి కబురు చెప్పింది. తాజాగా డీజె టిల్లు సీక్వెల్ షూటింగ్ మొదలయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు విధేయులైన 90 మందికి పైగా రాజస్థాన్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో కాంగ్రెస్ అధ్యక్షపదవిరేసునుంచి అశోక్ గెహ్లాట్ తొలగించబడ్డారు.
ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) సంస్థ పై రెండవ రౌండ్ దేశవ్యాప్త దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 247 మందిని అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్, కర్ణాటక, అస్సాం, ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్ఐఎ సోదాలు జరుగుతున్నాయి.
మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దసరా ఉత్సవాల్లో హింసకు పీఎఫ్ఐ భారీ కుట్ర చేసినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. నాగపూర్ అర్ ఎస్ ఎస్ కార్యాలయం వద్ద పీఎఫ్ఐ నేతలు రెక్కీ నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు.
దేశ ప్రజలంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సుప్రీం కోర్టు ప్రత్యక్ష్య ప్రసారాల వీక్షణ ఎట్టకేలకు ప్రారంభమైంది. చీఫ్ జస్టిస్ యు.యు. లలిత్ అండ్ టీం ఆధ్వర్యంలో తొలిసారిగా ప్రత్యక్ష్య ప్రసారాలను సర్వోత్తమ న్యాయస్థానం అందుబాటులోకి తీసుకొచ్చింది
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలపై నేడు ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు పాల్గొననున్నారు. వీరితో పాటు ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు, ఇతర కీలక శాఖల కూడా హాజరుకానున్నారు.