Home / బ్రేకింగ్ న్యూస్
ఉక్రెయిన్‌లోని జాపోరిజ్జియా నగరంలో శుక్రవారం పౌర కాన్వాయ్‌పై రష్యా క్షిపణి దాడి చేయడంతో కనీసం 30 మంది మరణించగా 88 మంది గాయపడ్డారు.
దేశంలో నేటి నుంచి 5జీ సేవలు మొదలయ్యాయి. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు.
దసరా పండుగ వేళ సామాన్యులకు గుడ్ న్యూస్. గ్యాస్ బండ ధరను తగ్గిస్తున్నట్టు చమురు కంపెనీలు వెల్లడించాయి. అది కూడా వాణిజ్య సిలిండర్లు వినియోగించే వారికే ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయని పేర్కొనింది.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ డూప్ సాగర్ పాండే గుండెపోటుతో నిన్న మరణించారు. సల్మాన్ ఖాన్‌కు డూప్ గా పేరుగాంచిన సాగర్, స్టంట్ మ్యాన్‌గా బాలివుడ్ ఇండస్ట్రిలో పనిచేస్తున్నారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేసిన ‘అన్‌స్టాపబుల్’ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పనవసరం లేదు. కాగా ఎప్పుడెప్పుడు అన్‌స్టాపబుల్ సీజన్ 2 వస్తుందా అని బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్ డేట్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించి బాలయ్య పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
చార్ ధామ్ యాత్రలో ప్రధానమైనది కేదారనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ ఆలయం ఏడాదిలో ఆరునెలల పాటు మంచుతో కప్పబడి ఉంటుంది. హిమగిరులలో నెలవైయున్న కేదారనాథుని దర్శనాని దేశవిదేశాల నుంచి భక్తులు తరలివెళ్తారు. కాగా కేదారనాథ్ కేత్రం వద్ద ఈ రోజు ఉదయం భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి.
కాబూల్‌లోని ఒక విద్యా కేంద్రంలో ఆత్మాహుతి బాంబు దాడిలో మృతుల సంఖ్య 100 కు చేరింది. స్థానిక జర్నలిస్టు చెప్పిన వివరాల ప్రకారం, ఈ సంఘటనలో విద్యార్థులు ఎక్కువగా హజారాలు మరియు షియాలు మరణించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు. వారి వారి ఆలోచనల మేరకు పాలన ఉంటుంది. హద్దు మీరి ప్రవర్తిస్తే మేం కూడా పరుషంగా మాట్లాడగలం. సీఎం కేసిఆర్ ను తిడితే మంత్రి హరీష్ కు సంతోషం అనుకొంటే అందుకు మేము రెడీ అని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుంచి సీనియన్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే. శశిథరూర్‌లు మాత్రమే ఒకరితో ఒకరు తలపడుతున్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ చేసింది. పార్టీకి, అనుబంధ సంస్ధలకు విరాళాలు ఇచ్చిన వారికి నోటీసులు జారీ చేసిన్నట్లు సమాచారం.