Last Updated:

Mega star Chiranjeevi: దివికేగిన ధ్రువతారకు పలువురు ప్రముఖల సంతాపం

సూపర్‌ స్టార్‌ కృష్ణ (80) ఇక లేరు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతి వార్తతో సినీలోకం ఒక్కసారిగా మూగబోయింది. సూపర్ స్టార్ మృతి పట్ల పలువురు ప్రముఖులు అశ్రునివాళులు అర్పించారు.

Mega star Chiranjeevi: దివికేగిన ధ్రువతారకు పలువురు ప్రముఖల సంతాపం

Mega star Chiranjeevi: సూపర్‌ స్టార్‌ కృష్ణ (80) ఇక లేరు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతి వార్తతో సినీలోకం ఒక్కసారిగా మూగబోయింది. సూపర్ స్టార్ మృతి పట్ల పలువురు ప్రముఖులు అశ్రునివాళులు అర్పించారు.

కృష్ణ మరణం.. మాటలకు అందని విషాదం- చిరంజీవి

సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ‘మాటలకు అందని విషాదం ఇది.. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు కలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయ పదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం.. వీటి కలబోత కృష్ణ గారు. అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు.. భారత సినీ పరిశ్రమలోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నా సోదరుడు మహేశ్ బాబుకు, ఆయన కటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేసుకుంటున్నాను’ అని ఎంతో బాధగా రాసుకొచ్చారు.

తెలుగు చలనచిత్ర రంగానికి ఇది తీరని లోటు- కేసీఆర్

సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతి తెలిపారు. కృష్ణ మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటన్నారని ఆయన తెలిపారు.

సూపర్‌స్టార్‌ బిరుదుకు సార్థకత- పవన్

సూపర్‌స్టార్‌ కృష్ణ తుదిశ్వాస విడిచారన్న విషయం ఎంతో ఆవేదన కలిగించిందని ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాన్‌ పేర్కొన్నారు. చిత్రసీమలో సూపర్‌స్టార్‌ బిరుదుకు కృష్ణ సార్థకత చేకూర్చారన్నారని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని పవన్ అన్నారు.

చిత్ర పరిశ్రమ ఓ దిగ్గజ నటుడిని కోల్పోయింది- చంద్రబాబు

తెలుగు చిత్ర పరిశ్రమ ఓ దిగ్గజ నటుడిని కోల్పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల చంద్రబాబు సంతాపం తెలిపారు. ఇటీవలే తల్లిని, ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయిన మహేష్ బాబుకు ఇది తీరని వేదన అని ఆయన పేర్కొన్నారు. ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని మహేష్ కు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:  ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ “సూపర్ స్టార్ కృష్ణ”

ఇవి కూడా చదవండి: