Last Updated:

Super Star Krishna: ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ “సూపర్ స్టార్ కృష్ణ”

నాలుగు దశాబ్ధాల పాటు వెండితెరపై మెరిసి, తెలుగు చిత్ర పరిశ్రమ నాట చెరగని ముద్ర వేశారు సూపర్ స్టార్ కృష్ణ. ముక్కుసూటిగా, నిజాయితీగా మాట్లాడేవాడు. తన సినిమా ఫ్లాప్ అయితే నిర్మొహమాటంగా ఆ సంగతి అంగీకరించేవాడు అలాంటి వ్యక్తిత్వం ఉన్న కృష్ణను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ప్రేక్షకులను అలరించేందుకు ఆయన నిర్విరామంగా సినిమాలు చేస్తూ మంచి స్టార్ డమ్ తెచ్చుకున్నారు. 

Super Star Krishna: ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ “సూపర్ స్టార్ కృష్ణ”

Super Star Krishna: నాలుగు దశాబ్ధాల పాటు వెండితెరపై మెరిసి, తెలుగు చిత్ర పరిశ్రమ నాట చెరగని ముద్ర వేశారు సూపర్ స్టార్ కృష్ణ. ముక్కుసూటిగా, నిజాయితీగా మాట్లాడేవాడు. తన సినిమా ఫ్లాప్ అయితే నిర్మొహమాటంగా ఆ సంగతి అంగీకరించేవాడు అలాంటి వ్యక్తిత్వం ఉన్న కృష్ణను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ప్రేక్షకులను అలరించేందుకు ఆయన నిర్విరామంగా సినిమాలు చేస్తూ మంచి స్టార్ డమ్ తెచ్చుకున్నారు.

వ్యక్తిగత జీవితం

కృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం. ఘట్టమనేని వీర రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి (సూపర్ స్టార్ కృష్ణ) మొదటి సంతానం. వారిది వ్యవయసాయ కుటుంబం. 1942 మే 31న కృష్ణ జన్మించారు. ప్రాథమిక విద్య తెనాలిలోనే పూర్తిచేశారు. తల్లిదండ్రులు తన కుమారుడిని ఇంజనీరు చెయ్యాలనుకోవడంతో ఇంటర్ ఎంపీసీ విద్యను ఏలూరులోని సి.ఆర్.రెడ్డి కళాశాలలో చేరాడు. అక్కడే ఇంటర్మీడియట్ పూర్తిచేసి తర్వాత బీఎస్సీ చదివాడు.

కృష్ణకు ఇద్దరు భార్యలు మొదటి భార్య ఇందిరాదేవి, రెండవ భార్య కథానాయిక నిర్మాత దర్శకురాలు అయిన విజయనిర్మల. కృష్ణ ఇందిరాదేవి దంపతులకు ఐదుగురు సంతానం రమేష్ బాబు, పద్మజ, మంజుల ఘట్టమనేని, మహేష్ బాబు, ప్రియదర్శిని. తొలి చిత్రం తేనెమనసులులో హీరోగా నటించక మునుపే కృష్ణకు ఇందిరా దేవితో వివాహం అయ్యింది.

అయితే  కృష్ణకు చిన్నతనం నుంచే ఎన్.టి.రామారావు అంటే అమితమైన ఇష్టం అతనికి పాతాళ భైరవి తన అభిమాన చిత్రం. కాగా డిగ్రీ చదివేరోజుల్లో వారి కళాశాలలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి అక్కినేని నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా అక్కడికి వచ్చిన నాగేశ్వరరావుకు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో తాను అంత ప్రజాదరణ పొందాలని భావించి సినిమాల్లోకి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. డిగ్రీతో చదవుకు స్వస్థి చెప్పి మద్రాసు పయనం అయ్యాడు.

ఎన్నో కొత్త పుంతలతో సినీ ప్రయాణం

పలు నాటకాలు ప్రదర్శిస్తూ సినిమాల్లో ఛాన్సుల కోసం వేట కొనసాగించేవాడు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశారు. “చేసిన పాపం కాశీకి వెళ్ళనా?” నాటకంలో శోభన్ బాబుతో కలిసి నటించాడు. తర్వాత గరికపాటి రాజారావు దర్శకత్వంలో ప్రజానాట్యమండలిలి చేరి ఛైర్మన్ నాటకంలో ఛైర్మన్ కుమారుడి పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఎల్వీ ప్రసాద్ తీస్తున్న కొడుకులు కోడళ్ళు అన్న సినిమాలో ఒక పాత్ర పోషించారు కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆతర్వాత పదండి ముందుకు, కులగోత్రాలు, పరువు ప్రతిష్ట వంటి సినిమాల్లో చిన్న పాత్రలు పోషించారు. 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవాళ్ళతో తాను తీస్తున్న తేనె మనసులు చిత్రం కోసం ఆడిషన్స్ నిర్వహిస్తుండగా ఆ సినిమాలో హీరోగా ఛాన్స్ దక్కింది. ఆ మూవీ తర్వాత ఇక కృష్ణ వెనక్కి తిరిగి చూసుకోలేదు. హీరోగా రెండో సినిమా అయిన కన్నెమనుసుల్లో నటిస్తున్న సమయంలోనే గూఢచారి 116 సినిమాలో హీరోగా కృష్ణకు నిర్మాత డూండీ అవకాశం ఇచ్చాడు. 1966 ఆగస్టు 11న విడుదలైన గూఢచారి 116 సినిమా సంచలన విజయం సాధించి కృష్ణ కెరీర్ మలుపుతిప్పింది. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ చిత్రంలో నటించాడు కృష్ణ. దానితో ఆయనకు ప్రేక్షకుల్లో ఆంధ్రా జేమ్స్‌బాండ్ అన్న పేరు వచ్చింది. ఈ విజయంతో కృష్ణ ఒకేసారి 20 సినిమాల్లో హీరోగా బుక్ అయ్యాడు. ఆ తర్వాత కెరీర్ పరంగా కృష్ణ వెనక్కి తిరిగి చూడలేదు వరుస సినిమాలతో రోజుకు మూడు షిఫ్టుల ప్రకారం నటించి ఒక సంవత్సరంలో 10 నుంచి 20 సినిమాల్లో నటించాడు. ఇలా తన 40ఏళ్ల సినీ కెరీర్లో 340 పైచిలుకు సినిమాల్లో ఆయన నటించారు. హాలీవుడ్‌లో ప్రఖ్యాతి చెందిన కౌబాయ్ జాన్రాను తెలుగులోకి తీసుకువస్తూ కృష్ణ స్వంత నిర్మాణంలో తీసిన మోసగాళ్ళకు మోసగాడు, విప్లవయోధుడు అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా తీసిన అల్లూరి సీతారామరాజు సినిమాలు కృష్ణ కెరీర్‌ను మరింత ఉన్నత స్థానానికి నడిపించాయి. 2017 సంక్రాంతికి కృష్ణ 50 ఏళ్ళకు పైగా సాగిన సుదీర్ఘమైన తన సినిమా కెరీర్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. 1970లో తన స్వంత నిర్మాణ సంస్థ పద్మాలయా పిక్చర్స్ ప్రారంభించాడు.

రాజకీయ ప్రవేశం

1972లో జైఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కృష్ణ ఆ ఉద్యమానికి బహిరంగంగా మద్దతునిచ్చాడు. 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 1989లో కృష్ణ కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించాడు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గంలో ఆయన ఓటమిపాలయ్యాడు. ఆ తర్వాత పలు కారణలతో ఆయన ప్రత్యక్ష రాజకీయలకు దూరంగా ఉన్నారు.

ఎన్నో అవార్డులు

1974లో ఉత్తమ నటునిగా నంది పురస్కారం అందుకున్నాడు. 1997లో ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం, 2003లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, 2009లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం వంటి గౌరవాలు కృష్ణకు లభించాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం కృష్ణను గౌరవిస్తూ ఓ పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది. 1976లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి కె.వి.రఘునాథరెడ్డి చేతుల మీదుగా కృష్ణ “నటశేఖర” బిరుదును అందుకున్నాడు.

ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ కృష్ణ

పలు హాలీవుడ్ తరహా జాన్రా చిత్రాలను తొలుత తెలుగు సినిమా తెరకు అతనే పరిచయం చేశాడు. తొలి జేమ్స్ బాండ్ తరహా చిత్రం గూఢచారి 116,తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్ళకు మోసగాడు,తొలి 70ఎంఎం సినిమా సింహాసనం, తొలి ఫుల్‌స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు చిత్రాలను ఈయనే తెలుగు సినీ రంగానికి పరిచయం చేశారు.

ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత చిన్న టీవీ.. దీని సైజ్ ఎంతో తెలిస్తే ఔరా అనక మానరు..!

ఇవి కూడా చదవండి: