Last Updated:

CM KCR: ముందస్తు ఎన్నికల పై కేసీఆర్ నజర్

మునుగోడు ఊపులో ‘ముందస్తు' ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరాటపడుతున్నారని సమాచారం. ఈ నెల 15న కేసీఆర్ టీఆర్ఎస్ కార్యవర్గ కీలక సమావేశం అందుకే నిర్వహిస్తున్నారా? అనే ప్రచారం తాజాగా సాగుతోంది.

CM KCR: ముందస్తు ఎన్నికల పై కేసీఆర్ నజర్

Hyderabad: మునుగోడు ఊపులో ‘ముందస్తు’ ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరాటపడుతున్నారని సమాచారం. ఈ నెల 15న కేసీఆర్ టీఆర్ఎస్ కార్యవర్గ కీలక సమావేశం అందుకే నిర్వహిస్తున్నారా? అనే ప్రచారం తాజాగా సాగుతోంది. గతంలో తెలంగాణ తొలి ప్రభుత్వంలో కేసీఆర్ ఇలానే ముందస్తుకు వెళ్లి గెలిచారు. బలం పెంచుకున్నారు. ఈసారి కూడా కేసీఆర్‌ అదే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈనెల 15న కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ భేటీలో ముందస్తు ఎన్నికల పై కీలక నిర్ణయం తీసుకుంటారన్న టాక్‌ వినిపిస్తోంది.

మునుగోడు ఉప ఎన్నికల్లో పాజిటివ్ ఫలితం రావడంతోపాటు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రం ఢీ అంటే ఢీ అనడంతో తేల్చుకోవాలనే పట్టుదలతోనే కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ఈ ఊపులోనే బీజేపీని ఓడించవచ్చని భావిస్తున్నారు. వేడి తగ్గక ముందే విజయం సాధించాలని చూస్తున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ నేతలతో కీలక సమావేశం నిర్వహించి కీలక నిర్ణయం తీసుకోనున్నారనే ప్రచారం సాగుతోంది. అటు, ఎమ్మెల్యేల ఎర ఎపిసోడ్‌ ఆసరాగా ప్రధాని మోదీ పై దుమ్మెత్తిపోస్తున్నారు కేసీఆర్‌. ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్లు కొనడం ఏంటని నిలదీస్తున్నారు. ప్రభుత్వాలు పడగొట్టడమే మోదీ, అమిత్‌ షా పనిగా మారిందని కేసీఆర్‌ తరచూ విమర్శిస్తున్నారు.

మరోవైపు, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. బీఆర్ఎస్ గా ఆవిర్భవించిన తర్వాత పార్టీ యాంత్రాంగం ఏ విధంగా పనిచేయాలి. పార్టీ కమిటీలు ఇతర రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాల పై కూడా మంగళవారం నాటి టీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ సమావేశం చర్చించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ గా మారిన తర్వాత జాతీయ స్థాయిలో ఎలాంటి పోరాటాలు చేయాలి? అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి? అలాగే, రాజకీయంగా ఎలాంటి ఉద్యమాలు చేయాలనే దాని పై చర్చ జరిగే అవకాశం ఉంది. షెడ్యూల్‌ ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 డిసెంబర్ లో జరుగుతాయి. దాని కంటే ముందే ఎన్నికలకు వెళ్లడానికి కేసీఆర్ రెడీ అయినట్టు సమాచారం. ఈ క్రమంలోనే కీలకమైన సమావేశం నిర్వహించడానికి కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే పలు సర్వేలు చేయించుకున్న కేసీఆర్, తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్టు టాక్‌ వినిపిస్తోంది.

ఇక, ఏ సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళితే మళ్లీ అధికారం దక్కుతుందనే విషయం పై కేసీఆర్ పక్కా లెక్కలు, జోతిష్యాన్ని పాటిస్తున్నారని తెలుస్తోంది. ఆయనకు జాతకాలు, జ్యోతిష్యాల పై నమ్మకం ఎక్కువ. మరి సంచలన నిర్ణయాలకు మారుపేరైన కేసీఆర్ ఈ మంగళవారం తర్వాత ఏమైనా చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

ఇవి కూడా చదవండి: