Last Updated:

Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. అపోలో ఆసుపత్రిలో చేరిక

ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు.

Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. అపోలో ఆసుపత్రిలో చేరిక

Kodali Nani: ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు.

ఏపీలో వైసీపీ నేతల్లో మంచి మాస్ ఇమేజ్ ఉన్న నేత కొడాలి నాని. ఇక తెదేపా, జనసేన నేతలపై అయితే ఈయన చేసే కామెంట్లు ఓ రేంజ్లో ఉంటాయని చెప్పవచ్చు. అలాంటి నేత, ఏపీ మాజీ మంత్రి అయిన కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు మూడు రోజుల క్రితమే హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. నిన్న రాత్రి కొడాలి నానికి వైద్యులు కిడ్నీ సంబంధిత శస్త్ర చికిత్సను నిర్వహించారు. కాగా ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రి ఐసీయూలో ఉన్నారు. రెండు, మూడు రోజుల్లో ఆయనను వైద్యులు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. రెండు వారాలపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకున్న అనంతరం 15 రోజుల తర్వాత కిడ్నీ సంబంధిత లేజర్ చికిత్సను కొడాలి నానికి చేయనున్నారు వైద్యులు.

ఇదీ చదవండి: “ఇదేం కర్మ” కార్యక్రమాన్ని చేపట్టనున్న చంద్రబాబు

ఇవి కూడా చదవండి: