Last Updated:

MP Dharmapuri Aravind: ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి

ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసారు. ఎమ్మెల్సీ కవిత పై అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలకు చేశారంటూ అరవింద్ కిటికీల అద్దాలు పగులగొట్టారు. ఆయన ఇంటి ముందు దిష్టిబొమ్మ దహనం చేశారు.

MP Dharmapuri Aravind: ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి

MP Dharmapuri Aravind: ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసారు. ఎమ్మెల్సీ కవిత పై అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలకు చేశారంటూ అరవింద్ కిటికీల అద్దాలు పగులగొట్టారు. ఆయన ఇంటి ముందు దిష్టిబొమ్మ దహనం చేశారు. పూలకుండీలు ధ్వంసం చేసారు. దాడి జరిగిన సమయంలో ఎంపీ అరవింద్ నిజామాబాద్లో ఉన్నారు.

గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అరవింద్ ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధమున్న కవితకు బీజేపీలో చోటు లేదని అన్నారు. ఆమెను తీసుకొస్తామన్న వారిని కూడా ఉపేక్షించమని చెప్పారు. అంతేకాదు కవిత కాంగ్రెస్ పార్టీల చేరడానికి మల్లికార్జున ఖర్గేతో మాట్లాడారాని ఆరోపించారు. దీని పై టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసారు.

మరోవైపు అరవింద్ వ్యాఖ్యల పై ఎమ్మెల్సీ కవిత కూడ మండిపడ్డారు. నేను కాంగ్రెస్ తో టచ్ ఉన్ననని కాంగ్రెస్ సెక్రటరీ చెప్పాడంట, అరవింద్ ఎందుకు కాంగ్రెస్ కు టచ్ లో ఉన్నారు అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో అందరికీ ఫ్రెండ్ షిప్ ఉంటది. అందరు మాట్లాడుతారు అని పేర్కొన్నారు. నిజామాబాద్ ప్రజల ఖర్మతో అరవింద్ గెలిచారని అన్నారు. ఇంకోసారి తన పై అరవింద్ నోరు పారేసుకుంటే ఊరుకోనని కవిత హెచ్చరించారు. అరవింద్ ఎక్కడ పోటీ చేసినా తాను ఓడిస్తానని కవిత స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి: