Home / బ్రేకింగ్ న్యూస్
భారతదేశ 15వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీ, అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ పోలింగ్ జరగనుంది. పార్లమెంటులో లోక్ సభ, రాజ్యసభ సభ్యులు మొత్తం 776 మంది
భారత జట్టు మరోసారి సత్తాచాటింది. ఇంగ్లాండ్ సొంతగడ్డపై రోహిత్ సేన ఆధిపత్యాన్ని ప్రదర్శించి వన్డే సిరీస్‌ను సైతం కైవసం చేసుకుంది.ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో 2-1 తేడాతో రోహిత్ సేన సిరీస్ కైవసం
వైసీపి మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎవరూ బాగు చేయలేరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. విధానపరమైన లోపాల గురించి ప్రశ్నిస్తే అసభ్యంగా తిడుతున్నారని, ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చివైసీపి అరాచక పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సబ్ ఇన్స్పెక్టర్ (SI) ఓవర్సీర్ గ్రూప్ B నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టుల కోసం అభ్యర్థులను రిక్రూట్ చేస్తోంది. దరఖాస్తు ప్రక్రియ జూలై 16న ప్రారంభమైంది మరియు పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 14, 2022.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు వసంత్ విహార్ ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా ఈ సంఘటన ఈ నెల 6న జరగ్గా, పోలీసులకు 8వ తేదీన ఫిర్యాదు అందింది. అత్యాచారానికి పాల్పడిన 23 , 25, 35 ఏళ్ల వ్యక్తులపై వివిధ సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. దీంతో పాటు పోస్కో యాక్ట్ కింది కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఓ వైపు కరోనాతో సతమతమవుతున్న ప్రజలపై వైరస్లు దండయాత్ర మొదలుపెట్టాయి. ఇప్పటికే కరోనాతో పాటు జికా వైరస్లు దేశంలో వ్యాప్తి చెందుతుండగా.. ఇప్పుడు దానికి మంకీపాక్స్ తోడైంది. ఈ మహమ్మారి తొలికేసు కేరళలో నమోదైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ వెల్లడించారు. ఈ నెల 12న యూఏఈ నుంచి తిరువనంతపురానికి వచ్చిన కొల్లాంకు చెందిన
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ ఏరియల్ సర్వే చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఏరియల్ సర్వే అనంతరం అధికారులతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. గోదావరి వరదలపై ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతన్ శుక్రవారం ఉదయం చెన్నైలో మరణించారు. 70 ఏళ్ల వయసున్న ఈ నటుడు చెన్నైలోని తన అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించారు. నాలుగు దశాబ్దాల కెరీర్లో, అతను 100 చిత్రాలలో నటించి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రతాప్ ఆగస్టు 1952లో జన్మించాడు. ముంబై యాడ్ ఏజెన్సీలో కాపీ రైటర్‌గా తన వృత్తిని ప్రారంభించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ఖరీఫ్ సీజన్లో దేశ వ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం 17.4 శాతం తగ్గింది. పప్పుధాన్యాలు, ముతక తృణధాన్యాలు మరియు నూనె గింజల విస్తీర్ణం 7-9 శాతం ఎక్కువగా ఉంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు వరిసాగు 128.50 లక్షల హెక్టార్లకు (ఎల్‌హెచ్) చేరుకుంది. అంతకు ముందు సంవత్సరం ఇదే
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ భారతదేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా వరుసగా నాలుగో సంవత్సరం అగ్రస్థానంలో నిలిపింది. విద్యా మంత్రిత్వ శాఖ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) 2021 ప్రకారం ఐఐటి మద్రాస్ "మొత్తం" "ఇంజనీరింగ్" విభాగాల్లో ముందుంది. ఐఐటీ మద్రాస్ తర్వాత ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఖరగ్‌పూర్‌లు