Paddy cultivation: దేశ వ్యాప్తంగా 17.4 శాతం తగ్గిన వరిసాగు
ప్రస్తుతం కొనసాగుతున్న ఖరీఫ్ సీజన్‌లో దేశ వ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం 17.4 శాతం తగ్గింది. పప్పుధాన్యాలు, ముతక తృణధాన్యాలు మరియు నూనె గింజల విస్తీర్ణం 7-9 శాతం ఎక్కువగా ఉంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఈ ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు వరిసాగు 128.50 లక్షల హెక్టార్లకు (ఎల్‌హెచ్) చేరుకుంది. అంతకు ముందు సంవత్సరం ఇదే
New Delhi: ప్రస్తుతం కొనసాగుతున్న ఖరీఫ్ సీజన్‌లో దేశ వ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం 17.4 శాతం తగ్గింది. పప్పుధాన్యాలు, ముతక తృణధాన్యాలు మరియు నూనె గింజల విస్తీర్ణం 7-9 శాతం ఎక్కువగా ఉంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఈ ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు వరిసాగు 128.50 లక్షల హెక్టార్లకు (ఎల్‌హెచ్) చేరుకుంది. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో 155.53 లక్షల హెక్టార్లు ఉంది.
పప్పు ధాన్యాల సాగు 9 శాతం పెరిగి 66.69 లక్షల హెక్టార్ల నుండి 72.66 లక్షల హెక్టార్లకు పెరిగింది. ముతకధాన్యాల సాగు 87.06 లక్షల హెక్టార్లనుండి 93.91 లక్షల హెక్టార్లకు 8 శాతం పెరిగింది. నూనెగింజల విస్తీర్ణం 7.38 శాతం పెరిగి 124.83 లక్షల హెక్టార్ల నుంచి 134.04 లక్షల హెక్టార్లుకు పెరిగింది.
నూనెగింజల క్రింద, సోయాబీన్ విస్తీర్ణం 90.32 లక్షలహెక్టార్ల నుండి 10 శాతం పెరిగి 99.35 లక్షలహెక్టార్లుకు చేరుకుంది. పత్తి విస్తీర్ణం 96.58 లక్షలహెక్టార్ల నుండి 6.44 శాతం పెరిగి 102.8 లక్షలహెక్టార్లకు చేరుకుంది. చెరకు విస్తీర్ణం 53.70 లక్షలహెక్టార్లు నుండి 53.31 లక్షల హెక్టార్లకి స్వల్పంగా తగ్గింది. జూట్ విస్తీర్ణం గత సంవత్సరం ఇదే కాలంలో 6.92 లక్షల హెక్టార్లతో పోలిస్తే 6.89 లక్షల హెక్టార్ల వద్ద ఉంది.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో జూలై 15 నాటికి ఖరీఫ్ కవరేజీలో ఉన్న మొత్తం ప్రాంతం గత ఏడాది ఇదే కాలంలో 591.3 లక్షలహెక్టార్ల నుండి 592.11 లక్షల హెక్టార్లకు స్వల్పంగా పెరిగింది.