Home / బ్రేకింగ్ న్యూస్
లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో 100 పరుగుల తేడాతో భారత జట్టుపై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 247 పరుగుల లక్ష్యాన్ని భారత క్రికెట్ జట్టు చేదించలేకపోయింది.247 పరుగుల విజయ లక్ష్యంలో బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు 146 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి భారత ఆటగాళ్లు వరుసగా ఔట్ అయ్యారు
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై మరో వినూత్న డిజిటల్ క్యాంపెయిన్ కు సిద్ధమయ్యారు. నియోజకవర్గాల్లో గ్రామీణ రహదారుల దుస్థితిపై ఒక నిమిషం వీడియో లేక నాలుగు ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలంటూ జనసేనాని పిలుపునిచ్చారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్ హష్ టాగ్ తో ఉదయం నుండి సోషల్ మీడియాలో జనసైనికుల పోస్టులు హల్చల్
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. తెలంగాణ, మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులో రికార్డు స్థాయిలో వరద ప్రవాహం నమోదు అవుతోంది. లక్ష్మీ బ్యారేజ్ ఇన్ ఫ్లో 28లక్షల 67వేల 650 క్యూసెక్కులుగా ఉంది. దీంతో లక్ష్మీ బ్యారేజ్ మొత్తం 85 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మరో 5 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయని. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో షీర్ జోన్ ఎఫెక్ట్ కొనసాగుతోందని, ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వివరించారు.
తెలంగాణలో నేటి నుంచి కొవిడ్ బూస్టర్ డోస్ అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్ో 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా కొవిడ్ వాక్సిన్ బూస్టర్ డోసు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 18 ఏళ్లుపై బడి అర్హులైన ప్రతి ఒక్కరికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంపై మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. రెండో డోసు తీసుకుని 6 నెలలు పూర్తయిన వారికి
ఏపీ సీఎం జగన్ ఏరియల్ నేడు వరదప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏరియల్ సర్వే కోసం ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రానున్న 24 నుంచి 48 గంటల్లో వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆహారం, జనాభా పెరుగుదలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తినటం, పిల్లల్ని కనడం అడవిలో జంతువులు కూడా చేస్తాయన్నారు. కానీ ఇది సభ్య సమాజంలో నివసించే మనుష్యులకు వర్తించదని అన్నారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి.
అక్రమ ఫోన్ ట్యాపింగ్ మరియు స్నూపింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిత్రా రామకృష్ణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కోర్టు నుంచి అనుమతి లభించడంతో ఏజెన్సీ రామకృష్ణను అరెస్టు చేసారు.
మహారాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్‌పై విలువ ఆధారిత పన్నువ్యాట్ (లీటరుకు వరుసగా రూ.5 మరియు రూ.3 తగ్గించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గురువారం తెలిపారు. గురువారం అర్ధరాత్రి నుంచి అమలు కానున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాపై రూ.6,000 కోట్ల భారం పడనుంది. ఇంధన ధరల పెంపుతో నష్టపోయిన సామాన్యులకు ఇది మేలు చేస్తుందని
భారతదేశంలో 2022 ప్రథమార్థంలో శామ్ సంగ్ మొబైల్ వ్యాపారం 20% వృద్ధిని నమోదు చేసిందని కంపెనీ సీనియర్ డైరెక్టర్ మరియు మార్కెటింగ్ హెడ్ ఆదిత్య బబ్బర్ తెలిపారు. శామ్ సంగ్ 2022 ప్రథమార్ధంలో23% మార్కెట్ వాటాను పొందింది. 17% వాటాతో జియోమి రెండవ స్థానంలో వుంది. బడ్జెట్ మరియు మధ్య-శ్రేణి మార్కెట్‌గా రూపొందుతున్న రూ.10,000-40,000 విభాగంలో శామ్ సంగ్