Last Updated:

Innova Hycross CNG: వావ్ ఇన్నోవా హైక్రాస్.. సీఎన్‌జీలో వచ్చేసింది.. మైలేజ్ చాలా పెరిగింది..!

Innova Hycross CNG: వావ్ ఇన్నోవా హైక్రాస్.. సీఎన్‌జీలో వచ్చేసింది.. మైలేజ్ చాలా పెరిగింది..!

Innova Hycross CNG: టయోటా ఇన్నోవా హైక్రాస్ ఒక ఫేమస్ ఎంపీవీ. ఈ కారును కిర్లోస్కర్ మోటర్ సంస్థ భారత్ మార్కెట్లో లాంచ్ చేసినప్పటి నుంచి భారీ సంఖ్యలో అమ్ముడవుతోంది. కారు లుక్, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది. కస్టమర్లు కూడా ఈ కారును కొనేందుకు పోటీపడుతున్నారు. ఈ ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్, హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే ప్రస్తుతం అదే హైక్రాస్ గరిష్ట మైలేజీని అందించడానికి CNG కిట్‌తో అబ్బురపరుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రండి.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

టయోటా ఈ ఇన్నోవా హైక్రాస్ ఎంపీవీలో మీరు ఊహించినట్లుగా కంపెనీ మేడ్ సీఎన్‌జీ కిట్ లేదు. ఓ కస్టమర్ గ్యారేజీ ద్వారా ఇన్నోవాకు సీఎన్‌జీ ట్యాంక్‌ను అమర్చాడు. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ. 19.94 లక్షల నుండి రూ. 31.34 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. GX, GX (O), VX, VX (O), ZX, ZX (O) వేరియంట్స్ హైక్రాస్‌లో అందుబాటులో ఉన్నాయి.

టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎంపీవీలో రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులోని 2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 175 పీఎస్ హార్స్ పవర్, 209 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరో 2-లీటర్ హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్) 186 పీఎస్ హార్స్ పవర్, 188 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CVT E-CVT గేర్‌బాక్స్ కూడా ఉన్నాయి. లీటర్‌పై 16.13 నుండి 23.24 kmpl వరకు మైలేజీని అందిస్తుంది.

ఇన్నోవా హైక్రాస్ సూపర్ వైట్, ప్లాటినం వైట్ పెర్ల్, సిల్వర్ మెటాలిక్, యాటిట్యూడ్ బ్లాక్ మైకా, స్పార్క్లింగ్ బ్లాక్ పెర్ల్, క్రిస్టల్ షైన్ రంగుల్లో కూడా అందుబాటులో ఉంది. ఇతర ఫీచర్లలో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ఉన్నాయి.

ఈ కారు ప్రయాణీకులకు గరిష్ట రక్షణను అందిస్తుంది. భద్రత పరంగా ఇందులో 6-ఎయిర్‌బ్యాగ్స్,వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్స్ చూడొచ్చు. కియా కేరెన్స్ ఎంపీవీ ఇన్నోవా హైక్రాస్‌తో నేరుగా పోటీపడుతుంది.