Home /Author M Rama Swamy
Michelle Obama : అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఆయన సతీమణి మిషెల్ ఒబామా విడాకులు తీసుకుంటున్నారంటూ కొంతకాలంగా వదంతులు వస్తున్నాయి. విడాకులపై ఒబామా భార్య మిషెల్ తాజాగా స్పందించారు. విడాకుల వార్తలను ఆమె కొట్టిపారేశారు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ పాడ్‌కాస్ట్‌లో హీరోయిన్ సోఫియా బుష్‌తో మిచెల్ ఒబామా సంభాషించారు. ప్రస్తుతం తాను వ్యక్తిగత విషయాలు, జీవితంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. తన గురించి ఆలోచించే సమయం ఇప్పుడు దొరికిందని, అందుకే అధికారిక, రాజకీయపరమైన కార్యకలాపాలకు […]
Telangana Education Department : తెలంగాణ విద్యాశాఖ విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రోజురోజుకూ ఎండలు మండిపోతుండగా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటన చేసింది. వేసవి సెలవులపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల జారీ చేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి వేసవి […]
CM Revanth Reddy : ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన ప్రతీ సీఎంకు ఒక బ్రాండ్ ఉందని, తన బ్రాండ్ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలో నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. కిలో బియ్యం రూ.2కే ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌ది, ఐటీని అధివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుది, ఆరోగ్య శ్రీని […]
Former BRS MLA Shakeel : బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వివిధ కేసుల్లో షకీల్‌పై అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో సాక్ష్యాలు తారుమారు చేసి తన కొడుకును రక్షించేందుకు షకీల్ ప్రయత్నించారనే అభియోగాలు ఉన్నాయి. అరెస్టు భయంతో దుబాయ్‌కి.. అరెస్టు భయంతో కొన్ని నెలలుగా షకీల్ దుబాయ్‌లో ఉంటున్నారు. షకీల్ తల్లి […]
High command takes serious action against ITDP activist Kiran : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతిపై ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ కార్యకర్తపై టీడీపీ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. భారతిపై సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. వీడియో వైరల్‌గా మారడంతో వైసీపీ కార్యకర్తలు కిరణ్‌ను టార్గెట్ చేసి కామెంట్లు పెడుతున్నారు. భారతిపై కిరణ్ చేసినవ్యాఖ్యలను టీడీపీ సీరియస్‌గా తీసుకుంది. భారతిపై […]
Kakani Govardhan Reddy : పరారీలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాకాణి దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. అన్ని విమానాశ్రయాలు, సీపోర్టులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. మరోవైపు పోలీసులు అతడికి మూడుసార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదు. 12 రోజులుగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వీరి జాడ కోసం […]
Tahawwur Rana : ముంబయి పేలుళ్ల ఘటనలో కీలక నిందితుడు తహవూర్ రాణాను అగ్రరాజ్యం అమెరికా సర్కారు ఇండియాకు అప్పగించగా, దీంతో అతడిని అధికారులు ఇండియాకు తరలిస్తున్నారు. ప్రత్యేక విమానం అమెరికా నంచి భారత్‌కు బయల్దేరింది. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలో ల్యాండ్ కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసును వాదించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్ మాన్‌ను నియమిస్తూ కేంద్ర హోం శాఖ గురువారం ఉత్తర్వులు జారీ […]
Union Minister’s Granddaughter Murder : కేంద్ర మంత్రి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జితన్ రామ్ మాంఝీ మనువరాలు సుష్మాదేవి (32) దారుణ హత్యకు గురైంది. బిహార్‌లోని గయ జిల్లా అత్రి బ్లాక్ పరిధిలోని టెటువా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆమె భర్తే కాల్చి చంపినట్లు అనుమానిస్తున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు.. వివరాల్లోకి వెళ్తే.. సుష్మ, ఆమె భర్త రమేశ్ మధ్య మనస్పర్థలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. సుష్మాదేవి తన […]
Israel-Gaza : గాజాపై మరోసారి ఇజ్రాయెల్ విరుచుకుపడింది. బుధవారం షెజైయాలో జరిపిన దాడిలో 38 మంది మృతిచెందినట్లు పాలస్తీనా ఆరోగ్యాధికారులు వెల్లడించారు. షెజైయాలోని ఒక భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో పిల్లలు సహా కనీసం 29 మంది పాలస్తీనియన్లు మృతిచెందారని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. డజన్ల కొద్దీ గాయపడ్డారని, చాలామంది శిథిలాల్లో చిక్కుకున్నారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ సైన్యం ఒక సీనియర్ హమాస్ ఉగ్రవాదిని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడింది. పౌరులకు హానీ తలపెట్టకుండా ప్రయత్నాలు చేశారు […]
Union Home Minister Amit Shah : ముంబై పేలుళ్ల ఘటన కేసులో కీలక నిందితుడు తహవ్వుర్ రాణాను గురువారం మధ్యాహ్నం ఇండియాకు తీసుకురానున్నారు. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. అతడి అప్పగింత ఇండియాకు అతిపెద్ద దౌత్య విజయంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. హాని కలిగించే వ్యక్తులను వ్యక్తులను వదలం.. దేశ ప్రజలకు హాని కలిగించే వ్యక్తులను ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర […]