Home /Author Narasimharao Chaluvadi
3 రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అందులో భాగంగానే ఉత్తరాంధ్రలో విశాఖ గర్జనకు పిలుపునిస్తున్నామని రాష్ట్ర మంత్రులు పదే పదే పేర్కొన్నారు.
ఇండియా సరిహద్దు భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్థాన్ డ్రోన్ ను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూల్చివేశారు.
కేసు తేలేంతవరకు, రాష్ట్రంలో విద్యా సంస్ధల్లో హిజాబ్ ను విద్యార్దులు తొలగించాల్సిందేనని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రాధమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్ పేర్కొన్నారు.
ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫసర్ డాక్టర్ జి.ఎన్. సాయిబాబాకు బాంబే హైకోర్టులో భారీ ఊరట లభించింది. నాగ్ పూర్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న సాయిబాబాను నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించింది
ఏపీ సీఎం జగన్, భార్య భారతీ ఇద్దరూ కలసి గవర్నర్ బిశ్వభూసన్ హరిచందన్ దంపతులతో భేటీ అయ్యారు. రాజ్ భవన్ కు చేరుకొన్న సీఎం దంపతులకు సంయుక్త కార్యదర్శి సూర్య ప్రకాష్ స్వాగతం పలికారు.
ఏపీ ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ జనసేన పార్టీ ఉత్తరాంధ్ర మంత్రులకు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. పదే పదే విశాఖ రాజధానిగా ఉండాలంటూ అమరావతి రాజధాని పై రగడ చేస్తున్న వైకాపా శ్రేణులు నోరెళ్లబెట్టేలా జనసేన పార్టీ లేఖాస్త్రం సంధించింది
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతే రాజధాని అన్న వారిని పొలిమేరల నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతం మరో అగ్ని గుండం కాబోతుందన్నారు.
2023లో జరగనున్న 10వ తరగతి పరిక్షల్లో 6 పేపర్లే ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొనింది. విద్యాశాఖ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రకటించింది.
అతను ఏం మాట్లాడిన సంచలనమే..అడపా, దడపా వస్తుంటారు. మాట్లాడిన రెండు మాటలు సంచలనంగా నిలుస్తుంటాయి. ఆయనే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. డబ్బులు ఎవరిచ్చినా, అది మీ డబ్బే..కాబట్టి తీసుకోండి అంటూ మునుగోడు ఓటర్ల నుద్దేశించి పేర్కొన్నారు.
ఏపీ సీఎం జగన్మెహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకొన్నారు. అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లో అక్టోబర్ 25 నుండి ఫేస్ యాప్ హాజరును తప్పనిసరి చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.