Home /Author Narasimharao Chaluvadi
హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల వేడి ఊపందుకొనింది. భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకొంటున్నారు. ఈ నేపథ్యంలో సోలన్ లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన పరివర్తన్ ప్రతిజ్నా ర్యాలీలో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా భాజపా పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఓ ఎన్నారై భక్తుడు భూరి విరాళాన్ని అందచేశారు. అమెరికాలో స్ధిరపడిన డేగా వినోద్ కుమార్, రాధిక రెడ్డిలు కోటి రూపాయల బ్యాంకు డీడీని తితిదే కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డికి అందచేశారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో నేతలు అడ్డంగా బుక్కవుతున్నారు. ఒక పార్టీపై మరొక పార్టీ విమర్శించుకొనే క్రమంలో తెలంగాణ మంత్రి కేటిఆర్ ను భాజపా అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడ్డంగా ఇరికించారు
భాగ్యనగరంలో నిత్యం ఎక్కడో ఓ చోట దొంగతనాలు, మర్డర్లు కామన్ గా మారిపోయాయి. మరీ ముఖ్యంగా మహిళలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందోనని ఆందోళనలు చెందుతున్నారు. అందుకు తగ్గట్టుగానే సికింద్రాబాద్ లో ఓ ఘటన అద్దం పడుతుంది.
వర్క్ ఫ్రం హోం పై ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకొనింది. హైబ్రిడ్ పని విధానం వైపే మొగ్గు చూపింది. ఉద్యోగులు ఆఫీసుకు రావడాన్ని ఇప్పుడప్పుడే తప్పనిసరి చేయబోమని తేల్చి చెప్పాంది.
ఊహించిన్నట్లుగానే హిమాచల ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. నవంబర్ 12న ఎన్నికల జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొనింది.
తెలంగాణలో ఉప ఎన్నికలకు సిద్ధమైన మునుగోడులో కొత్త ఓటర్లను వేల సంఖ్యలో నమోదు చేసుకొనేలా అధికార పార్టీ ప్రయత్నించిందని, కోర్టు మెట్లెక్కిన భాజపా నేతలకు తెలంగాణ హైకోర్టు ఊరట కల్గించింది.
వరంగల్ ఏజీఎం ఆసుపత్రిలో రోగులు, వైద్య సిబ్బంది హడలెత్తారు. ఓ త్రాచుపాము ఆసుపత్రిలోకి ప్రవేశించడంతో ఈ ఘటన చోటుచేసుకొనింది
ఉన్న కేసుల్లోనే పలు మొట్టికాయలు తింటున్న ప్రభుత్వ పనితీరు మారదంటూ ఏపీ హైకోర్టులో మరో కేసు దాఖలైంది.
ప్రకృతి సహజ సిద్ధమైన రుషికొండను, నేటి ప్రభుత్వం బోడి కొండగా మార్చిందని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి తెదేపా కేంద్ర కార్యాలయంలో లీగల్ సెల్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన మట్లాడారు.