Last Updated:

Bombay High Court: జీవిత ఖైదు కేసులో మాజీ ప్రొఫసర్ సాయిబాబాకు ఊరట

ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫసర్ డాక్టర్ జి.ఎన్. సాయిబాబాకు బాంబే హైకోర్టులో భారీ ఊరట లభించింది. నాగ్ పూర్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న సాయిబాబాను నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించింది

Bombay High Court: జీవిత ఖైదు కేసులో మాజీ ప్రొఫసర్ సాయిబాబాకు ఊరట

Professor GN Saibaba: ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫసర్ డాక్టర్ జి.ఎన్. సాయిబాబాకు బాంబే హైకోర్టులో భారీ ఊరట లభించింది. నాగ్ పూర్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న సాయిబాబాను నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించింది. తక్షణమే ఆయన్ను జైలు నుండి విడుదల చేయాలని కోర్టు అధికారులను ఆదేశించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణ నేపధ్యంలో 2017 మార్చిలో సెషన్సు కోర్టు వీరందిరికి జీవిత ఖైదు విధించింది.

వివరాల్లోకి వెళ్లితే, 2014 మే నెలలో ప్రొఫసర్ సాయిబాబాతో పాటు ఓ జర్నలిస్టు, జవహర్ లాల్ నెహ్రు విశ్వ విద్యాలయం విద్యార్ధి, మరికొందరిని మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. 2017లో వీరందరికి జీవిత ఖైదు శిక్షను కోర్టు విధించింది. దీనిపై బాంబే హైకోర్టులో వీరంతా అప్పీలు చేసుకొన్నారు. నాగ్ పూర్ బెంచ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వీరందరినీ నిర్దోషులుగా తేల్చుతూ నేడు కోర్టు కీలక తీర్పునిచ్చింది.

ప్రొఫసర్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఢిల్లీ యూనివర్సిటీ ఆయన్ను విధుల నుండి తొలగించింది. గత ఏడాది ఆయన్ను పూర్తి స్థాయిలో విధుల నుండి తొలగిస్తూ తీర్మానం చేశారు. ఈ నేపధ్యంలో బాంబే కోర్టు నిర్దోషిగా తేల్చడంతో ఆనాటి నుండి నేటివరకు జీతభత్యాలతోపాటు ప్రొఫసర్ ను యధావిధిగా విధుల్లోకి తీసుకొంటారా లేదా అనేది తేలాల్సి ఉంది.

ఇది కూడా చదవండి:Diwali Crackers: దీపావళి టపాసులు… ఢిల్లీ వాసులకు నొ చెప్పిన సుప్రీంకోర్టు…

ఇవి కూడా చదవండి: