Home /Author Guruvendhar Reddy
IPL 2025 Schedule Released: ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ ఏడాది మార్చి 21 నుంచి ప్రారంభం కానుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. అలాగే మే 25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఫైనల్ మ్యాచ్ ఉంటుందని తెలిపారు. బీసీసీఐ ప్రత్యేక సాధారణ సమావేశం ముంబయిలో జరిగింది. ఈ మీటింగ్ అనంతరం రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడారు. ఐపీఎల్‌కు కొత్త కమిషనర్‌ను ఎన్నుకుంటామని వెల్లడించారు. ఐపీఎల్ పూర్తి స్థాయి షెడ్యూల్‌ను […]
India Women vs Ireland Women cricket match: ఐర్లాండ్ ఉమెన్స్ టీంతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఆదివారం రాజ్ కోట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 116 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. దీంతో మరో మ్యాచ్ ఉండగానే స్మృతి మంధాన సేన మూడు వన్డేల టోర్నీలో 2-0 తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల […]
Telugu States CMs Sankranthi Wishes 2025: తెలుగు ప్రజలందరికీ ఇరు రాష్ట్రాల సీఎంలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అలాగే కనుమ పండుగను అందరూ ఆనందంగా చేసుకోవాలని, పతంగులు ఎగురవేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే, ప్రతి ఇంట్లో పండుగ శోభ వికసించాలని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. సమాజంలో […]
Former Nagarkurnool MP Manda Jagannadham Passed Away: నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ డాక్టర్ మందా జగన్నాథం (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనను ఇటీవల హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలలో 1951 మే 22వ తేదీన జన్మించిన జగన్నాథం.. మెడిసిన్ చదివి కొంతకాలం వైద్యుడిగా పనిచేశారు. […]
Zuckerberg sentational comments on Biden admin people: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ పై వచ్చిన దుష్ప్రభావాలపై వచ్చిన పోస్టులకు సంబంధించి పలు ఆరోపణలు చేశారు. ఈ పోస్టుల విషయంలో జోబైడెన్ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి గురిచేసిందని, ఆ పోస్టులు తొలగించాలని చెప్పిందన్నారు. తాజాగా, ‘ద జో రోగన్ ఎక్స్ పీరియన్స్’ పాడ్ కాస్ట్ లో భాగంగా ఆయన […]
AP Deputy CM Pawan Kalyan visit Orvakallu at Kurnool: ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పిన్నాపురంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద గ్రీన్కో సోలార్ పార్క్ తోపాటు పంప్ స్టోరేజ్ ప్రాజెక్టు సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా అధికారులతో కలిసి పవన్ కల్యాణ్ పరిశీలించారు. అనంతరం రోడ్డు మార్గంలో ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. రూ.30వేల కోట్లు పెట్టుబడులు.. ఏపీలో […]
BRS Working President KTR demands arrest of Cong leaders for attack on Bhuvanagiri party office: భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై ఎన్ఎస్యూఐ కార్యకర్తలు దాడి చేయడం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. సీఎం రేవంత్‌రెడ్డిపై యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయం అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ ఆఫీసు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దాడి […]
National Youth Day Swami Vivekananda Jayanti-2025: పరాయి పాలనలో మగ్గుతూ, తన స్వీయ అస్తిత్వాన్ని కోల్పోయిన భరత జాతిని తట్టిలేపి, ఈ జాతికి తన ఘనమైన గతాన్ని, కోల్పోయిన వైభవాన్ని, సాగిపోవాల్సిన మార్గాలను గుర్తుచేసి చైతన్యవాణి. పశ్చిమదేశపు భౌతిక ఆవిష్కరణలను, భారతీయ సనాతన మూలాలను మేళవించి, ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించాలని ఆరాటపడిన ఆధ్యాత్మిక విప్లవకారుడు. ప్రధానంగా.. 1.‘లేవండి.. మేల్కోండి, 2.గమ్యం చేరే వరకూ విశ్రమించకండి, 3.బలమే జీవితం..బలహీనతే మరణం. 4.ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, […]
CM Chandrababu Full Speech at Guntur: ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని, అందుకే రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరులో చేబ్రోలు హనుమయ్య కంపెనీ దగ్గర ఏర్పాటు చేసిన నరెడ్కో ప్రాపర్టీ షోను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేసిందని చంద్రబాబు విమర్శలు చేశారు. మమ్మల్ని నమ్మి 93 శాతం మంది అభ్యర్థులను గెలిపించారని చంద్రబాబు […]
CM Revanth Reddy Comments on Hyderabad Fourth City: హైదరాబాద్‌లో ఫోర్త్, ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైటెక్ సిటీలోని సీఐఐ నేషనల్ కౌన్సిల్ మీటింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కిల్స్, ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించామని చెప్పారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో తెలంగాణనే నెంబర్ వన్ వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. మూసీలో 55 కి.మీ వరకు తాగునీరు అందేలా చూస్తామని […]