Home /Author Guruvendhar Reddy
AP Government Clarifies over Volunteers Continuation: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై కీలక ప్రకటన వెలువడింది. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు విషయంపై ప్రభుత్వం తమ వైఖరి స్పష్టం చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో కొంతమంది సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా వాలంటీర్ల వేతనాల అంశం చర్చకు వచ్చింది. ఈ విషయంపై మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పందించారు. రాష్ట్రంలో ఈ వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని అసెంబ్లీ […]
AP Cabinet Meeting Today: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ బుధవారం రాజధాని అమరావతిలో సమావేశం కానున్నది. సాయంత్రం 4.00 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో భేటీ జరగనున్నది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తుంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అమలు చేయాల్సిన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. రాజధాని పనులపై ఫోకస్ రాజధాని అమరావతికి సంబంధించి గతంలో గుత్తేదారులకు కేటాయించిన పనుల టెండర్ల రద్దుకు ఈ సమావేశంలో మంత్రులతో చర్చించి, […]
Low pressure in Bay of Bengal AP Rain Alert: ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ అధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. ఈనెల 21న దక్షిణ అండమాన్ పై ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, 23 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఈ అల్పపీడనం 25న వాయుగుండంగా బలపడనుందని, దీనిమూలంగా మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. తీర ప్రాంతాలకే ముప్పు నవంబర్ 21వ తేదీన దక్షిణ అండమాన్ […]
AP Govt initiative Ayyappa Devotees: కూటమి ప్రభుత్వం చొరవతో కేరళలో చిక్కుకున్న అయ్యప్ప భక్తులు క్షేమంగా దర్శనానికి వెళ్లారు. నెల్లూరు నియోజకవర్గ పరిధి వెదురుకుప్పం మండలం గొడుగుచింత గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల యాత్రకు కేరళ వెళ్లారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో వారికి రోడ్డు ప్రమాదం జరగడంతో కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై తమ తప్పు లేకున్నా కేరళ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారని, దర్శనం ఉందని చెబుతున్నా సహకరించడం లేదని ఆవేదన […]
Canada extends working hours for students: కెనడా దేశానికి ఉన్నత చదువులు చదివేందుకు వెళ్లిన విదేశీ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కెనడాలో చదువుకునే భారత్ సహా ఇతర దేశాల విద్యార్థుల పని గంటల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు క్యాంపస్ వెలుపల వారంలో పనిచేసే సమయాన్ని పెంచుతున్నట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. కెనడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వారంలో 20 గంటల వరకు పనిచేసుకునే వెసులుబాటు.. ఇక […]
Maharashtra, Jharkhand Assembly Elections: మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా.. మహారాష్ట్రలో 9 గంటల వరకు 6.61శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఝార్ఖండ్‌లో 12.71శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. మహారాష్ట్రలో ఒకే విడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా.. ఝార్ఖండ్‌లో రెండో విడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. అలాగే యూపీలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో […]
K Sanjay Murthy appointed next Comptroller and Auditor General: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పదవిలో తెలుగు అధికారి నియామకమయ్యారు. కాగ్ కు కొత్త చీఫ్ గా అమలాపురానికి చెందిన ఐఏఎస్ అధికారి కె.సంజయ్ మూర్తిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 బ్యాచ్ కు చెందిన సంజయ్ ని కాగ్ చీఫ్ గా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నియమించగా, కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంజయ్ మూర్తి […]
Satwik-Chirag back on circuit: గాయం కారణంగా ఆటకు దూరమైన భారత డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి.. చైనా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో తిరిగి రంగంలోకి దిగారు. సాత్విక్ భుజానికి గాయం కారణంగా పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఈ జోడీ ఆ తర్వాత జరిగిన ఆర్కిటిక్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, చైనా ఓపెన్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలకు దూరమైంది. కాగా, గాయం నుంచి సాత్విక్ కోలుకోవడంతో మంగళవారం వీరిద్దరూ చైనా […]
Israeli PM Netanyahu Confirms Hitting Iran Nuke Sites: గత కొన్ని నెలలుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పరోక్ష యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది. రెండు దేశాలూ తరచూ కవ్వింపు చర్యలతో బాటు దాడులకూ తెగబడుతున్న వేళ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ మరోసారి ఇరాన్ మీద తమ వైఖరిని స్పష్టం చేశారు. తాజాగా, ఆయన ఆ దేశ పార్లమెంట్లో మాట్లాడుతూ, ఆరునూరైనా ఇరాన్ ఒక అణుశక్తిగా అవతరించకుండా చూస్తామని ప్రకటించారు. లక్ష్యం టెహ్రాన్.. […]
Telangana BJP New President: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎన్నిక తర్వలో జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీలోని సీనియర్ నేతలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. గతంలో టీ బీజేపీ బాస్‌గా ఉన్న బండి సంజయ్‌ని తప్పించిన అధిష్ఠానం ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని కూర్చోబెట్టింది. తాజాగా, రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమించాలని యోచిస్తున్న హస్తిన పెద్దలు పలు కోణాల్లో ఇక్కడి నేతల పేర్లను పరిశీలిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నలుగురు కీలక నేతలు ఈసారి బరిలో […]