Home /Author Jyothi Gummadidala
గత రెండు రెండు మూడు రోజులుగా ఏపీలోని కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్న మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీన పడింది. ఈ మేరకు తాజా వెదర్ రిపోర్టును ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ వెల్లడించారు. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితను ఇవాళ ఉదయం 11గంటలకు హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో సీబీఐ విచారించనుంది. ఇప్పటికే కవిత ఇంటి వద్దకు చేరుకున్న సీబీఐ అధికారులు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు.
పవన్ హరీష్ శంకర్‌తో కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులకు పండగే. గతంలో వీరిద్దరి కాంబో వచ్చిన గబ్బర్ సింగ్ అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మరోమారు ఈ ఇద్దరి కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే మొదట్లో 'భవదీయుడు భగత్ సింగ్' అనే పేరుతో ఆ మూవీకి నామకరణం చేసి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కాగా ఇప్పుడు ఆ సినిమా పేరును మార్చుతూ మరో అప్డేట్ ను విడుదల చేశారు చిత్ర బృందం.
తాజాగా మహేష్ ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. తన భార్య నమ్రత పేరు మీద రీసెంట్గా రెస్టారెంట్ ప్రారంభారు ప్రిన్స్. మినర్వా కాఫీ షాప్, ప్యాలెస్ హైట్స్ రెస్టారెంట్‌తో చేతులు కలిపిన మహేష్ నమ్రత ఏషియన్ గ్రూప్స్ ఏఎన్(AN) పేరు రెస్టారెంట్‌ను ప్రారంభించారు.
బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ తనయుడు అతి త్వరలో బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్యన్ ఖానే వెల్లడించారు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. తండ్రి షారుఖ్ తరహాలో ఆర్యన్ హీరోగా తెరమీద కనిపించకుండా తెరవెనుక ఉండనున్నాడు.
భారతదేశపు దిగ్గజ అథ్లెట్, పరుగుల రాణి అనగానే టక్కున గుర్తొచ్చే పేరు పీటీ ఉష. ఈ స్టార్ క్రీడాకారిణి మరో అరుదైన ఘనతను సాధించారు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా ఉష ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలను ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా చూస్తోంది. కాగా ఈ టోర్నీలో నిన్న ఖతార్ వేదికగా జరిగిన అర్జెంటీనా, నెదర్లాండ్స్ మ్యాచ్ ఆధ్యంతం ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్ లో సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ.. మరోసారి తన సత్తా చాటాడు. అర్జెంటీనాకు నాయకత్వం వహిస్తున్న మెస్సీ.. పెనాల్టీ షూటవుట్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించి, తమ జట్టును సెమీఫైనల్స్ చేర్చి వీక్షకుల మనసులను గెల్చాడు.
వన్షిక (Vanshika) బ్రేకప్ వీడియో ఇప్పుడు ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. డిసెంబర్ 8వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు చండీగఢ్‌కు చెందిన @hajarkagalwa అనే యూజర్ ఇషా పేరుతో ఈ వీడియోను పోస్ట్ చేశారు. వీడియో పోస్ట్ అయిన కొన్ని గంటల్లోనే ఇది వైరల్ అయ్యింది. వేలాది మంది ఈ వీడియోను రీట్వీట్ చేశారు. 15 లక్షల మంది వీడియో చూశారు. ‘ప్రాబబ్లీ ఫన్నీయెస్ట్ పోస్ట్ బ్రేకప్ క్రైయింగ్ సెషన్’ పేరుతో ఇషా ట్విటర్లో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. నెట్‌ఫ్లిక్స్ ఇండియా కూడా దీనికి స్పందించింది.
పవన్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ ఫోటో షేర్ చేశారు. అది ప్రస్తుతం నెట్టింట ఫుల్ బజ్ క్రియేట్ చేస్తోంది. దాదాపు 2 దశాబ్దాల తరువాత పవన్ కళ్యాణ్ మరల అలా చూస్తున్నందుకు అభిమానులు ఎంతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పవన్ తాజాగా తాను ఇదివరకు నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ను మెరుగులు దిద్దుతూ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు.
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పండుగ రద్దీ వేళ ప్రయాణికుల సౌకర్యార్థం ఏకంగా 4,233 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.