Home /Author Jyothi Gummadidala
యంగ్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారు అయిన ఉదయనిధి స్టాలిన్ సినిమాలకు గుడ్ బై చెప్పాడు. పదేళ్లుగా తన సినిమాలతో మెప్పించిన తమిళ, తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ యంగ్ హీరో ఇకపై సినిమాలు చెయ్యనని పేర్కొన్నారు.
కేసీఆర్, కేటీఆర్ పై కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. ఇదేనా బంగారు తెలంగాణ అంటే.. అంటూ కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళ మరుగుదొడ్డిలోనే నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటుందని పేదలకు చెందాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు ఏమయ్యాయి అంటూ ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు.
మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్ ఏపీపై ఇంకా కనిపిస్తోంది. తీరం దాటి బలహీనపడినప్పటికీ దాని ప్రభావం మాత్రం బలంగానే ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే తెలుగురాష్ట్రాల్లో వందల ఎకరాల్లో పంటలు నష్టపోయి రైతులు బిక్కుబిక్కుమంటున్న తరుణంలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఇప్పటికే మాండూస్ తుఫాను నుంచి పూర్తిగా కోలుకోక ముందే మరో అల్పపీడన ముప్పు ఏపీని ముంచుకొస్తుంది.
ధర భారీగా పెరిగినా సిగరెట్ల వాడకం తగ్గలేదని పార్లమెంటరీ స్థాయీ సంఘమే స్వయంగా వెల్లడించింది. ధర పెరగితేనేం పెట్టె కొనే చోట.. అరపెట్టే కొంటాం లేదా ఒక్క సిగరెట్ కొంటాం కానీ ఊదడం మాత్రం మానవు అంటున్నారు పొగరాయుళ్లు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ కాచిగూడ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న తారకరామ థియేటర్ ఆధునిక టెక్నాలజీతో సరికొత్తగా పునర్నిర్మితమైంది. ఏషియన్ తారకరామగా మారింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార రథం వారాహి విషయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ ప్రచార రథం రంగుపై అయితే రకరకాల విమర్శలు ప్రతివిమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా తాజాగా ఈ విషయమై ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు.
ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్-2022 టోర్నీలో క్రొయేషియా, అర్జెంటీనాకు మధ్య జరిగిన మ్యాచ్ లో మెస్సీ సేన విజయం సాధించింది. ఈ విజయంతో అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడేందుకు మెస్సీ ఒక్క అడుగుదూరంలో ఉన్నాడు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో ఈనెల 9వ తేదీన చైనా, భారత్ ఆర్మీల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో భారత సైనికులు ఎవ్వరూ చనిపోలేదని, ఎవరికీ తీవ్రమైన గాయాలు కూడా కాలేదని రక్షణ శాఖ వెల్లడించింది.
లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు అడ్డంగా బుక్కైన హర్యానా ఫరీదాబాద్‌లోని ఓ ఎస్సై ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు డబ్బును లను నోట్లో కుక్కుకుని.. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ వీడియో చూసెయ్యండి.
షారుక్ ఖాన్ ఇటీవల మక్కాను సందర్శించి అక్కడి సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా శక్తిపీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న జమ్మూలోని మాతా వైష్ణో దేవి ఆలయాన్ని ఈ హీరో సందర్శించారు. ప్రస్తుతం వైష్ణో దేవి ఆలయం వద్ద ఎస్సార్కే ఉన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.