Last Updated:

Messi: ఫిఫా ప్రపంచకప్ లో మెరిసిన మెస్సీ.. సూపర్ గోల్స్ తో సెమీస్ చేరిన అర్జెంటీనా..!

ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలను ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా చూస్తోంది. కాగా ఈ టోర్నీలో నిన్న ఖతార్ వేదికగా జరిగిన అర్జెంటీనా, నెదర్లాండ్స్ మ్యాచ్ ఆధ్యంతం ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్ లో సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ.. మరోసారి తన సత్తా చాటాడు. అర్జెంటీనాకు నాయకత్వం వహిస్తున్న మెస్సీ.. పెనాల్టీ షూటవుట్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించి, తమ జట్టును సెమీఫైనల్స్ చేర్చి వీక్షకుల మనసులను గెల్చాడు.

Messi: ఫిఫా ప్రపంచకప్ లో మెరిసిన మెస్సీ.. సూపర్ గోల్స్ తో సెమీస్ చేరిన అర్జెంటీనా..!

Messi: ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలను ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా చూస్తోంది. కాగా ఈ టోర్నీలో నిన్న ఖతార్ వేదికగా జరిగిన అర్జెంటీనా, నెదర్లాండ్స్ మ్యాచ్ ఆధ్యంతం ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్ లో సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ.. మరోసారి తన సత్తా చాటాడు. అర్జెంటీనాకు నాయకత్వం వహిస్తున్న మెస్సీ.. పెనాల్టీ షూటవుట్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించి, తమ జట్టును సెమీఫైనల్స్ చేర్చి వీక్షకుల మనసులను గెల్చాడు.

ఇరు జట్లమధ్య హోరాహోరీగా సాగిన ఈ క్వార్టర్ ఫైనల్స్ లో రెండు జట్ల మధ్య ఉన్న తేడా ఏంటంటే మెస్సీనే అనడం అతిశయోక్తి కాదు.
ఈ మ్యాచ్ ఆరంభం నుంచే మెస్సీ సేన తన ఆధిపత్యాన్ని చెలాయించారు. మొదటి హాఫ్‌లో చాలా సమయం బంతిని తమ వద్దే ఉంచుకున్న అర్జెంటీనా గోల్స్ చేసేందుకు తెగ ప్రయత్నించింది. ఈ క్రమంలోనే మెస్సీ అద్భుతమైన షాట్‌తో ఒక గోల్ సాధించాడు. తొలి హాఫ్ టైం గడిచేసరికి అర్జెంటీనా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇకపోతే సెకండ్ హాఫ్‌లో అర్జెంటీనా బంతి తమ ఆధీనంలోనే ఉంచుకోగా నెదర్లాండ్స్ ప్లేయర్ చేసిన తప్పిదానికి అర్జెంటీనాకు పెనాల్టీ దక్కింది. దానితో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న మెస్సీ.. తానే ఈ కిక్ అవకాశాన్ని తీసుకున్నాడు. అత్యంత తెలివిగా బంతిని గోల్‌లోకి కొట్టి తన ఖాతాలో రెండో గోల్ వేసుకున్నాడు.

దీంతో అర్జెంటీనా ఆధిక్యం 2-0కు పెరిగింది. ఇక మెస్సీ సేన విజయం ఖాయమని భావిస్తున్న క్రమంలో నెదర్లాండ్స్ ఆటగాళ్లు రెచ్చిపోయారు.
వెగ్రాస్ట్ ఎంతో చాకచక్యంగా రెండు గోల్స్ చేశాడు. దీనితో మ్యాచ్ ముగిసే సమయానికి ఇరు జట్ల స్కోర్లు 2-2గా ఉన్నాయి. దీంతో అదనంగా 30 నిమిషాల ఎక్స్‌ట్రా టైం ఇస్తున్నట్లు రిఫరీ ప్రకటించాడు. దానితో చివరి నిమిషంలో గోల్ చేసి నెదర్లాండ్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేయాలని భావించింది అర్జెంటీనా. కానీ టైం ముగిసేసరికి ఏ జట్టు కూడా గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటవుట్‌కు దారి తీసింది.
ఈ తరుణంలో నెదర్లాండ్స్ జట్టు తన తొలి రెండు కిక్స్‌లో గోల్ చేయలేకపోయింది. దానితో ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్న అర్జెంటీనా 4-3 తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించి సెమీఫైనల్ చేరుకుంది. దానితో ప్రపంచ కప్ టైటిల్ ను మెస్సీ సేన కౌవసం చేసుకోనుందని సాకర్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ఫిఫా వరల్డ్ కప్ గేమ్‌లో స్కోర్ చేసిన మరియు ఆట ఆడడానికి అసిస్ట్ అందించిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా లియోనెల్ మెస్సీ చరిత్ర సృష్టించాడు.

ఇదీ చదవండి: డబుల్ సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్… భారీ స్కోరు దిశగా ఇండియా !

ఇవి కూడా చదవండి: