Last Updated:

Vanshika: వన్షిక బ్రేకప్ వైరల్ వీడియో: ఎవరీ వన్షిక? బ్రేకప్ బాధ ట్విటర్‌లో ఎందుకు ట్రెండ్ అయ్యింది?

వన్షిక (Vanshika) బ్రేకప్ వీడియో ఇప్పుడు ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది. డిసెంబర్ 8వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు చండీగఢ్‌కు చెందిన @hajarkagalwa అనే యూజర్ ఇషా పేరుతో ఈ వీడియోను పోస్ట్ చేశారు. వీడియో పోస్ట్ అయిన కొన్ని గంటల్లోనే ఇది వైరల్ అయ్యింది. వేలాది మంది ఈ వీడియోను రీట్వీట్ చేశారు. 15 లక్షల మంది వీడియో చూశారు. ‘ప్రాబబ్లీ ఫన్నీయెస్ట్ పోస్ట్ బ్రేకప్ క్రైయింగ్ సెషన్’ పేరుతో ఇషా ట్విటర్‌లో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. నెట్‌ఫ్లిక్స్ ఇండియా కూడా దీనికి స్పందించింది.

Vanshika: వన్షిక బ్రేకప్ వైరల్ వీడియో: ఎవరీ వన్షిక? బ్రేకప్ బాధ ట్విటర్‌లో ఎందుకు ట్రెండ్ అయ్యింది?

Vanshika: వన్షిక (Vanshika) బ్రేకప్ వీడియో ఇప్పుడు ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది. డిసెంబర్ 8వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు చండీగఢ్‌కు చెందిన @hajarkagalwa అనే యూజర్ ఇషా పేరుతో ఈ వీడియోను పోస్ట్ చేశారు. వీడియో పోస్ట్ అయిన కొన్ని గంటల్లోనే ఇది వైరల్ అయ్యింది. వేలాది మంది ఈ వీడియోను రీట్వీట్ చేశారు. 15 లక్షల మంది వీడియో చూశారు. ‘ప్రాబబ్లీ ఫన్నీయెస్ట్ పోస్ట్ బ్రేకప్ క్రైయింగ్ సెషన్’ పేరుతో ఇషా ట్విటర్‌లో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. నెట్‌ఫ్లిక్స్ ఇండియా కూడా దీనికి స్పందించింది. ‘అందమైన ప్రేమ కథలన్నీ ప్రధాన పాత్ర హృదయం ముక్కలవడంతోనే పుట్టుకొస్తాయి. నువ్వూ దీన్ని పొందావు వన్షికా’ అంటూ లవ్ సింబల్‌లో నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్వీట్ చేసింది.

ఇక వన్షికపై ట్విటర్‌లో వేలాదిగా మీమ్స్ కూడా పుట్టుకొచ్చాయి. ఈ వీడియో ఇంత వైరల్ ఎందుకు అయ్యిందో తెలియాలంటే వన్షిక బాధ తెలుసుకోవాలి.. మీ కోసం వన్షిక బ్రేకప్ తెలంగాణ వర్షన్:

రికార్డ్ చేస్తున్న ఫ్రెండు – ఆగు నువ్వేం చెప్తూన్నావో మళ్లా చెప్పు
బ్రేకప్ అయిన వన్షిక – ఏం లేదే.. నాదీ, ఆకాష్‌ గానిది టూ మంత్ యానివర్సరీ కోసం థ్రెడింగ్, వ్యాక్సింగ్.. అన్నీ చేపించుకున్నా నేను.
ఎంత ఏడ్చిననో తెల్సా.. పార్లర్‌ వాళ్ల ముంగట. మస్తు బాధతో అర్చినా.. ఆని ధైర్యం చూడు.. ఐయామ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. ఐ థింక్ వి షుడ్ టేక్ ఎ బ్రేక్ అంటుండు.
రికార్డ్ చేస్తున్న ఫ్రెండు – ఏందే ఆకాష్ గాడు ఇట్ల చేస్తుండు.
బ్రేకప్ అయిన వన్షిక – నీకు తెల్సుగానే.. కాలేజీలో పోరగాండ్లందరూ నా ఎంటనే పడుతుండే.. కానీ నేను వీడి కోసం ఎవడినీ దేఖలేదు.
రికార్డ్ చేస్తున్న ఫ్రెండు – అవునే.. ఆర్య, ఆదిత్యా.. ఈల్లంతా నీ ఇప్పటికీ నిన్ను మస్త్ పాణం చేస్తరు( ఇష్టపడతరూ). నువ్వే ఫేమస్సే.
బ్రేకప్ అయిన వన్షిక – ఏం చేయనే. గిసంటోని కోసం ఎన్ని కష్టాలు పెడ్డాను. నీకు తెలుసా.. గా ఎత్తు చెప్పులు ఏసుకుని నడవనీకి గిట్ల రాదు.
అయినా టూ మంత్ యానివర్సరీ గదా అని ఏదో ఒకటి వాడి కోసం చేద్దాం అనుకున్నానే.
రికార్డ్ చేస్తున్న ఫ్రెండు – అవునే.. టూ మంత్ యానివర్సరీ చిన్న ముచ్చటనే గదే. పెద్ద ముచ్చటేం గాదుకదా. వాడేం జేయలేదా నీకోసం?
బ్రేకప్ అయిన వన్షిక – ఆడేం జేసిండే ఏ..మీ జెయ్యలే.. గిట్లయితదని నాకు ముందుగాల్నే తెలిస్తే.. నేను జర ఆగుతుండే.. మింత్రా సేల్ కోసం. నాకు జర పైసల్ అయినా మిగుల్తుండే..
రికార్డ్ చేస్తున్న ఫ్రెండు – అవునే. పైసలు మిగుల్చుకోవడం మాత్రం ఇపార్టెంటే. చెప్పువే.. నువ్వు నెయిల్ ఎక్స్‌టెన్షన్ చేయించుకున్నావు. గాడేమో నీకోసం ఏం చేయలే.. గిసంటోడు దొరికిండేందే.
బ్రేకప్ అయిన వన్షిక – ఏం జెప్పనే. నేను వాని కోసం మస్తు జేసినా.. అయినా వాడికి నియత్ ఉండదు. నాకసలు స్పోర్ట్ చూడ బుద్దే కాదు.. అయినా ఆని కోసం ఫుట్‌బాల్ చూడటం షురూ జేసినా.. అసలు నాకు దాని గురించి ఏమ్ సమజ్ కాదు. అయినా సరే వాడిని ఇష్టంకదా అని చూస్తుంటే..
రికార్డ్ చేస్తున్న ఫ్రెండు – అవునే.. గిప్పుడు రొనాల్డో, మెస్సీని గర్తుపడతవ్ గదా నువ్.
బ్రేకప్ అయిన వన్షిక – ఏం చెప్పాల్నే.. గాని గురించి ఎన్నెన్ని అనుకున్నా మస్తు ప్లాన్లు వేసుకున్నానో తెలుసా..
రికార్డ్ చేస్తున్న ఫ్రెండు – నీకు దేల్సా.. నా ఫ్రెండ్ గాడు ఒకడు ఉంటాడు.. గాడు రోజు నీ ఫొటో చూసి.. ఈ పిల్ల ఎవరు ఈ పిల్ల ఎవరు అని అడుగుతుండే. రోజంతా వంశిక వంశిక అంటుండే..
బ్రేకప్ అయిన వన్షిక – అవునా.
రికార్డ్ చేస్తున్న ఫ్రెండు – అవునే.
బ్రేకప్ అయిన వన్షిక – ఎట్లుండడే ఆడు బాగుంటడా..
రికార్డ్ చేస్తున్న ఫ్రెండు – మస్తుంటడే.. గాని డీటేల్స్ నీకిస్తా జూడు. గాడితో డేటింగ్‌కు బోవే.. ఆడు పనికొస్తాడులే.
బ్రేకప్ అయిన వన్షిక – అవునా. ఇయ్యే. నాది గిన ఇస్తా.

ఇకపోతే ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. తన బ్రేకప్ ఏడుపు ఎంత ట్రెండ్ అవుతుందో చూసిన వంశిక ఎలా రియాక్ట్ అవుతోందో చాడాలంటూ కొందరు యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలా మొత్తంగా ఈవీడియో ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

ఇదీ చదవండి: వైసీపీ ట్విటర్ అకౌంట్ హ్యాక్ జగన్‌కి షాక్… పార్టీ అకౌంట్లోకి ఎలాన్ మస్క్, కోతులు…

ఇవి కూడా చదవండి: