Last Updated:

Surbhi Jyoti: ప్రియుడితో ‘నాగిని’ బ్యూటీ సురభి పెళ్లి – మెహందీ, హల్దీ ఫోటోలు వైరల్

Surbhi Jyoti: ప్రియుడితో ‘నాగిని’ బ్యూటీ సురభి పెళ్లి – మెహందీ, హల్దీ ఫోటోలు వైరల్

Surbhi Jyoti and Sumit Suri Hald Photos Goes Viral:నాగిని బ్యూటీ, బుల్లితెర హీరోయిన్‌ సురభీ జ్యోతి పెళ్లికి రెడీ అయ్యింది. ప్రియుడు సమిత్‌ సూరితో ఆదివారం (అక్టోబర్‌ 27) ఏడడుగులు వేయనుంది. బాలీవుడ్‌ బుల్లితెర లవ్‌బర్డ్స్‌ అయిన వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారని తెలిసి ఫ్యాన్స్‌ అంతా ఖుష్‌ అవుతున్నారు. కాగా గత రెండు రోజులు ఈ జంట తమ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను వరుసగా షేర్‌ చేస్తున్నారు. ఇప్పటికే మెహందీ, హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను సురభీ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్ చేసింది. దీంతో ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఉత్తరాఖండ్‌ జిమ్‌ కార్బెట్ నేషనల్‌ పార్క్‌లోని ఓ రిసార్టు వీరి వివాహ మహోత్సవానికి వేదిక కానుంది. ప్రకృతి మధ్యలోనే వీరి పెళ్లి వేడుకలు జరగతుండటం విశేషం. ఇక సింపుల్‌ డెకరేషన్‌లో ప్రకృతి మధ్యలోనే జరుపుకుంటోంది ఈ ప్రేమజంట. ఈ పెళ్లికి కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితులు, ఇరుకుటుంబ సభ్యులు మాత్రమే హజరైనట్టు సమాచారం. ఈ బుల్లితెర ప్రేమ జంట వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్న సందర్భంగా వారికి అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు శుభకాంక్షలు తెలుపుతున్నాయి.

కాగా ఓ మ్యూజిక్‌ అల్బమ్‌లో కలిసిన నటించిన సురభి-సుమిత్‌లు అప్పుడే ప్రేమలో పడ్డారుజ . హాంజి: ద మ్యారేజ్‌ మంత్ర అనే మ్యూజిక్‌ వీడియోలో జంటగా నటించారు. అప్పుడే వీరిద్దర పరిచయం అయ్యింది. అది కాస్తా ప్రేమగా మారడంతో కొంతకాలం డేటింగ్‌లో ఉన్న వీరు ఈ ఏడాది ప్రేమలో తమ రిలేషన్‌ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు అక్టోబర్‌లో వైవాహిక జీవితంలో అడుగుపెట్టి కొంతజీవితం ప్రారంభించబోతున్నారు.

కాగా సురభీ జ్యోతి.. నాగిని, ఖబూల్‌ హై, ఇష్క్‌బాజ్‌, కోయి లౌట్‌కే ఆయా హై సీరియల్స్‌లో ఫీమేల్‌ లీడ్‌గా నటించింది. నాగిని సీరియల్‌తో ఆమె మంచి గుర్తింపు పొందింది. ఈ సీరియల్‌ తెలుగు, తమిళ్‌, మలయాళంలో డబ్‌ అయ్యింది. దీంతో సురభీ జ్యోతి సౌత్‌ ఆడియన్స్‌కి కూడా సుపరిచితమైంది. ఆమె ప్రియుడు సుమిత్‌ సూరి మోడల్‌, నటుడు. దాదాపు 30పైగా వాణిజ్య ప్రకటనల్లో నటించిన అతడు 2013లో వార్నింగ్‌ అనే సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత బబ్లూ హ్యాపీ హై, వాట్‌ ద ఫిష్ వంటి చిత్రాలతో పాటు పలు వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించాడు.