Nara Lokesh : మళ్ళీ ప్రారంభం కానున్న నారా లోకేష్ “యువగళం” పాదయాత్ర..
తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న “యువగళం” పాదయాత్ర గురించి తెలిసిందే. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు అరెస్ట్ కావడంతో పదయాత్రకు బ్రేక్ పడింది. కాగా తాజాగా ఏపీ హైకోర్టు రెగ్యులర్
Nara Lokesh : తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న “యువగళం” పాదయాత్ర గురించి తెలిసిందే. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు అరెస్ట్ కావడంతో పదయాత్రకు బ్రేక్ పడింది. కాగా తాజాగా ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.
దాంతో ఇప్పుడు మళ్ళీ నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఈ నెల 24న ప్రారంభం కానుందని తెలుస్తుంది. సెప్టెంబర్ 9న కోనసీమ జిల్లా రాజోలు మండలంలో యువగళం యాత్ర ఆగిపోగా.. ఇప్పుడు అక్కడి నుంచే పునఃప్రారంభవం కానుంది. రేపు సాయంత్రానికల్లా యాత్రకు సంబంధించిన సమన్వయకర్తలు, వాలంటీర్లు రాజోలుకు చేరుకోవాలని పార్టీ నాయకత్వం కోరింది. ఇక ఈ యాత్ర డిసెంబర్ చివరి వారం వరకు కొనసాగనుంది. యాత్ర పూర్తి అయ్యే సమయానికి ఆయన 3,550 కిలోమీటర్లు నడిచే అవకాశం ఉంది. యువగళం పాదయాత్ర రాజోలు నుంచి పి. గన్నవరం, అమలాపురం, కొత్తపేట, తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, రాజమండ్రి మీదుగా విశాఖ దిశగా సాగుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో వైకాపాను గద్దె దించడమే లక్ష్యంగా జనసేన, తెదేపా పార్టీలు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓట్లను చీలనివ్వకుండా ప్రజా సంక్షేమం కొరకు ఎన్నికల్లో జనసేన – టీడీపీ కలిసి పని చేస్తాయని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇటు పార్టీలు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి ఉమ్మడిగా చర్చలు జరుపుతున్నారు. ఇక త్వరలోనే జనసేన వారాహి యాత్ర కూడా ప్రారంభం కానుందని సమాచారం అందుతుంది.