Last Updated:

Pawan Kalyan: విశాఖ మత్స్యకారులకు అండగా జనసేనాని పవన్ కళ్యాణ్

: విశాఖ షిప్పింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు ఆర్దిక సాయం చేయాలని జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. 60కి పైగా బో ట్ల దగ్ధం జరిగి నష్టపోయిన బోట్ల యజమానులకు ఒక్కొక్కరికి ఏభై వేల రూపాయలు ఆర్దిక సాయం చేస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Pawan Kalyan: విశాఖ మత్స్యకారులకు అండగా జనసేనాని  పవన్ కళ్యాణ్

Pawan Kalyan : విశాఖ షిప్పింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు ఆర్దిక సాయం చేయాలని జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. 60కి పైగా బో ట్ల దగ్ధం జరిగి నష్టపోయిన బోట్ల యజమానులకు ఒక్కొక్కరికి ఏభై వేల రూపాయలు ఆర్దిక సాయం చేస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ఆర్దిక సాయాన్ని వచ్చే రెండు మూడు రోజుల్లో తానే స్వయం గా వచ్చి ఇస్తానని చెప్పారు. నష్టపోయిన మత్స్య కారుల కుటుంబాలకు జనసేన అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.

విశాఖలోని ఫిషింగ్‌ హార్బర్‌లో సోమవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఓ బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో40 కు పైగా బోట్లు కాలిపోయాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేశారు. దీంతో భారీగా ఆస్తి నష్టం సంభవించిందని మత్స్యకారులు చెబుతున్నారు. కళ్ల ముందే తమ బోట్లు మంటల్లో కాలిపోతుంటే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక్కో బోటు 40 నుంచి 50 లక్షల విలువ ఉంటుంది.అర్ధరాత్రి పూట ఓ యూట్యూబర్ ఫిషింగ్ హార్బర్ లో పార్టీ చేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రి పార్టీ అనంతరం యువకుల మద్య గొడవ జరిగి ఉంండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గోడవ అనంతరం ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. దానితో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. మరోవైపు విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఘటనపై లోతైన విచారణ జరపాలన్నారు. విచారణ జరిపిన పోలీసులు లోకల్ బాయ్ నాని అనే యూ ట్యూబర్‌ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ఏపీ పాలకులకు చిత్తశుద్ది లేదు..(Pawan Kalyan)

మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి కల్పనపై ఏపీ పాలకులకు చిత్తశుద్ది లేకపోవడం వలనే వారు జీవనోపాధికి ఇతర రాష్ట్రాలకు వలస వెల్లిపోతున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. గుజరాత్, కేరళ తీరాల్లో ప్రతి 30 కి.మీ. లకు ఒక జెట్టీ ఉండటంతో మత్స్యకారుల ఉపాధికి, వేటకి సైలభ్యం ఏర్పడిందని ఏపీలో మాత్రం ప్రభుత్వం మాటలకే పరిమితమయిందని ఆయన అన్నారు. సీఎం అధికార నివాసానికి రూ.451 కోట్లు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం మత్స్యకారుల జెట్టీలు, హార్బర్ల నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదని అన్నారు. సీఎం నివాసానికి చేస్తున్న ఖర్చుతో ఒక హార్బర్, ఏడు జెట్టీలు నిర్మించవచ్చని  అన్నారు. అయితే ఏపీ ప్రభుత్వానికి మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి ప్రాధాన్యతలు కాదని పవన్ అన్నారు. వారికి సంబంధించిన సంక్షేమ పధకాల అమల్లో సైతం కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. జనసేన, టీడీపీ ప్రభుత్వంలో మత్స్యకారులకు ఉపాధి కల్పనపై ప్రణాళికా బద్దంగా ముందుకు వెడతామని అన్నారు. తీరప్రాంతాలను అభివృద్ది చేసి అక్కడ గ్రామాల్లో విద్య, వైద్య వసతుల మెరుగుదలపైన, మత్స్యకార కుటుంబాల్లోని మహిళలు, వృద్దుల సంక్షేమం పైన దృష్టిపెడతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.