Onion Prices: ఆకాశాన్నంటున్న ఉల్లి ధరలు… ఢిల్లీలో రూ.90 కు చేరుకున్న కిలో ఉల్లి
దేశ రాజధాని న్యూఢిల్లీ సహా పలు నగరాల్లో ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. ఢిల్లీలో నాణ్యమైన ఉల్లి రిటైల్ ధర కిలో రూ.90కి చేరుకుంది. నిన్నటి వరకు కిలో రూ.80కి లభించేది. కాగా, ఉల్లి కిలో రూ.70కి విక్రయిస్తున్నారు. కర్నాటక, మహారాష్ట్రల్లో వర్షాలు ఆలస్యమై ఖరీఫ్ పంటలు విత్తడం ఆలస్యమై ఆ తర్వాత మార్కెట్లోకి కొత్త ఉల్లిపాయలు రాకపోవడమే ఉల్లి ధరల పెరుగుదలకు కారణమని భావిస్తున్నారు.
Onion Prices: దేశ రాజధాని న్యూఢిల్లీ సహా పలు నగరాల్లో ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. ఢిల్లీలో నాణ్యమైన ఉల్లి రిటైల్ ధర కిలో రూ.90కి చేరుకుంది. నిన్నటి వరకు కిలో రూ.80కి లభించేది. కాగా, ఉల్లి కిలో రూ.70కి విక్రయిస్తున్నారు. కర్నాటక, మహారాష్ట్రల్లో వర్షాలు ఆలస్యమై ఖరీఫ్ పంటలు విత్తడం ఆలస్యమై ఆ తర్వాత మార్కెట్లోకి కొత్త ఉల్లిపాయలు రాకపోవడమే ఉల్లి ధరల పెరుగుదలకు కారణమని భావిస్తున్నారు.
ఢిల్లీ మాదిరిగానే కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా ఉల్లి ధరలు పెరిగాయి. బెంగళూరులోని యశ్వంతపూర్ ఏపీఎంసీలో కిలో ఉల్లి రూ.65 నుంచి 70కి లభించింది. మహారాష్ట్రలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది.ఆగస్టు మధ్యకాలం నుండి 22 రాష్ట్రాల్లోని వివిధ ప్రదేశాలలో హోల్సేల్ మరియు రిటైల్ మార్కెట్లలో తమ స్టాక్ నుండి 1.7 లక్షల టన్నుల ఉల్లిపాయలను విక్రయించినట్లు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఉల్లి ఎగుమతి ధర టన్నుకు $800..( Onion Prices)
అక్టోబరు 29 నుండి డిసెంబర్ 31, 2023 వరకు అమలులోకి వచ్చే ఉల్లిపాయ ఎగుమతిపై మెట్రిక్ టన్నుకు $800 కనీస ఎగుమతి ధర (MEP)ని ప్రభుత్వం శనివారం నోటిఫై చేసింది.ఉల్లి ఎగుమతులను నియంత్రించడం మరియు సరసమైన ధరలకు దేశీయ వినియోగదారులకు తగినంత ఉల్లి లభ్యతను కొనసాగించడానికి ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మెట్రిక్ టన్నుకు $800 ఉన్న ఉల్లి కిలో రూ. 67కి వస్తుంది. అంతేకాదు అదనంగా 2 లక్షల టన్నుల ఉల్లిని సేకరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది, ఇప్పటికే సేకరించిన 5 లక్షల టన్నులకు పైగాఉల్లిని ఆగస్టు రెండవ వారం నుండి దేశవ్యాప్తంగా ప్రధాన వినియోగ కేంద్రాలకు పంపించం జరిగింది. ఈ ఉల్లిని NCCF మరియు NAFED ద్వారా నిర్వహించబడే మొబైల్ వ్యాన్ల ద్వారా రిటైల్ వినియోగదారులకు కిలోకు రూ. 25 చొప్పున సరఫరా చేసారు.