Last Updated:

Leo Movie : దళపతి విజయ్ “లియో” గురించి సీక్రెట్ రివీల్ చేసిన ఉదయనిధి స్టాలిన్.. ఫ్యాన్స్ కి పండగే !

దళపతి విజయ్.. నటిస్తున్న లేటెస్ట్ మూవీ “లియో”. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్, ‘మాస్టర్’ తర్వాత విజయ్ – లోకేష్ కాంబినేషన్లో రాబోతున్న

Leo Movie : దళపతి విజయ్ “లియో” గురించి సీక్రెట్ రివీల్ చేసిన ఉదయనిధి స్టాలిన్.. ఫ్యాన్స్ కి పండగే !

Leo Movie : దళపతి విజయ్.. నటిస్తున్న లేటెస్ట్ మూవీ “లియో”. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్, ‘మాస్టర్’ తర్వాత విజయ్ – లోకేష్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 19న దసరా కానుకగా తమిళం తో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

అయితే ఖైదీ, విక్రమ్ సినిమాలతో ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్.. లియోని (Leo Movie) కూడా ఆ సినిమాలతో లింకు చేశారా ? లేదా?? అనే డౌట్ ఇప్పుడు అందరిలో ఉంది. ఇక సోషల్ మీడియాలో అయితే రోజుకో వార్తపుట్టుకొస్తుంది. రీసెంట్ గా రామ్ చరణ్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేశారని వార్తలు వైరల్ అవ్వగా.. తాజాగా అలాంటిదేం లేదని క్లారిటీ వచ్చింది. ఈ క్రమం లోనే అసలు ఈ మూవీ LCUలో భాగంగా వస్తుందా అనే సందేహం మొదలైంది.

ఈ క్రమంలోనే ఈ డౌట్ లు అన్నింటికీ తమిళ హీరో, నిర్మాత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ క్లారిటీ ఇచ్చారు. లియో సినిమాని తమిళంలో ఉదయనిధి రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మేరకు.. ఈ మూవీని ఉదయనిధి చూసి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో.. లియో సినిమా సూపర్ గా ఉందని.. ఫైట్స్, లోకేష్ ఫిలిం మేకింగ్, అనిరుద్ సంగీతం.. అన్ని అదిరిపోయాయి అంటూ రాసుకొచ్చారు. ఇక ఆ ట్వీట్ చివరిలో “LCU టీం ఆల్ ది బెస్ట్” అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. దాంతో ఈ మూవీ LCUలో భాగంగా వస్తుందని కన్ఫార్మ్ చేసేశారని విజయ్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు.

 

 

అక్టోబరు 19న ఈ మూవీ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది. కాగా తెలుగులో పోస్టుపోన్ అవ్వబోతుందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. రిలీజ్ కి ఎదురైన సమస్యని పరిష్కరించి రిలీజ్ కి సిద్ధం చేశారు మేకర్స్. అలాగే ఒక సర్‌ప్రైజ్ స్టార్ ఎంట్రీ కూడా సినిమా క్లైమాక్స్ లో ఉండబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈసారి లోకేష్ ఏం మ్యాజిక్ చేస్తాడో అని..